Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ నుండి పాత టీమ్‌లు అవుట్...

జబర్దస్త్, ఈ కామెడీ షోకు తెలుగు నాట పరిచయం అవసరం లేదు. కామెడీ షోలలో రారాజుగా దూసుకుపోతున్న ఇది మొదట్లో ఆరోగ్యకరమైన కామెడీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత రేటింగ్‌లను మరింత పెంచడం కోసం ఇందులో డబుల

Webdunia
గురువారం, 27 జులై 2017 (10:47 IST)
జబర్దస్త్, ఈ కామెడీ షోకు తెలుగు నాట పరిచయం అవసరం లేదు. కామెడీ షోలలో రారాజుగా దూసుకుపోతున్న ఇది మొదట్లో ఆరోగ్యకరమైన కామెడీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత రేటింగ్‌లను మరింత పెంచడం కోసం ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, బూతు కంటెంట్ వచ్చి చేరాయి. కుటుంబంతో కలిసి కూర్చుని చూడలేని విధంగా ఉంటున్నాయి ఇందులోని స్కిట్‌లు. లాస్ట్ ఎపిసోడ్‌లో నాగబాబు ఇది మీ లాస్ట్ స్కిట్ అని టీమ్ లీడర్లందరినీ హెచ్చరించారు. 
 
అయితే ఇది నవ్వులాట కోసం చెప్పినప్పటికీ జబర్దస్త్ యాజమాన్యం ముందు హెచ్చరికగా ఈ మాటలను నాగబాబు నోట పలికించినట్లు ప్రచారం జరుగుతోంది. నిర్వాహకులు పాత టీమ్‌లను తీసేసి కొత్త వారికి ఆవకాశాలు ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా క్రేజ్‌ను బట్టి పారితోషికాలు భారీగా ఉన్నట్లు, వాటిని తాము భరించలేమంటూ యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. దీనిపై ఆది మండిపడ్డారని ప్రచారం జరుగుతోంది. టీమ్ లీడర్లందరూ ఎన్నో ఆటుపోట్లు అధిగమించి షోను ఈ స్థాయికి తెచ్చారు. వారికి కూడా ప్రజలలో మంచి పాపులారిటీ లభించింది. 
 
ఇప్పుడిప్పుడే సినిమాలలో అవకాశాలు పొందుతూ కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న సమయంలో ఇలా తీసేస్తే తమ పరిస్థితి ఏంటని నిలదీయగా కొత్తవాళ్లకు అవకాశమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నాగబాబు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఎన్ని కేసులు ఉన్నప్పటికీ, ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ జబర్దస్త్ ఇంకా నంబర్ 1 షోగా కొనసాగుతోంది. అంత లాభాన్ని తెచ్చిపెట్టిన ఈ షోలో మార్పులు చేయడానికి రెమ్యునరేషనే కారణమా లేక వేరే కారణాలు ఉన్నాయా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments