Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీకి లైగర్ బిగ్ పంచ్, అద్దె కట్టలేని స్థితిలో ఇల్లు ఖాళీ చేసాడా?

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (14:00 IST)
పూరీ జగన్నాథ్. లైగర్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేద్దామనుకున్నాడు. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డాడు. సుమారు 120 కోట్ల భారీ బడ్జెట్టుతో తెరకెక్కించాడు. కానీ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఆడలేదు. విడుదలైన తొలిరోజే సినిమా ఫ్లాప్ అంటూ రివ్యూలు, కామెంట్లు వచ్చేసాయి. దీనితో సుమారు 60 కోట్ల మేర నష్టపడినట్లు ట్రేడ్ వర్గాలు భోగట్టా.

 
ఇక అసలు విషయానికి వస్తే.... లైగర్ దెబ్బకి పూరీ జగన్నాథ్ అద్దె కట్టలేని స్థితిలోకి వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి. ముంబై మహానగరంలో ఎంతో ఇష్టంగా తీసుకున్న ఇంటి నుంచి పూరీ ఖాళీ చేసాడని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. ఈ ఇంటికి నెల అద్దె అక్షరాల 15 లక్షలు చెల్లిస్తూ వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మొన్నటివరకూ దర్జాగా ఇంట్లో హ్యాపీగా వున్న పూరీ... లైగర్ దెబ్బకి ఆర్థికంగా బాగా ఇరుక్కుపోయాడని అంటున్నారు. లైగర్ హిట్ అయితే ముంబైలోనే సెటిల్ కావచ్చని కూడా అనుకున్నారట.

 
గతంలో కూడా ఆర్థికంగా కాస్త ఇబ్బందులు తలెత్తినప్పటికీ... హీరో రామ్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ తో అన్నీ తీరిపోయి లాభాలు వచ్చాయి. దీనితో ఆ డబ్బును పూర్తిగా లైగర్ లో పెట్టేయడమే కాకుండా బడ్జెట్ అంచనా పెరిగిపోవడంతో సుమారు 120 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ అసలులో సగం డబ్బు కూడా రాకపోవడంతో బయ్యర్లు లబోదిబోమంటున్నారట. దీనితో పూరీ జగన్నాథ్ ఇబ్బందుల్లో పడ్డాడని టాలీవుడ్ జనం అనుకుంటున్నారు. ఐతే నిర్మాత చార్మీ మాత్రం ఇవన్నీ రూమర్స్.. రూమర్స్... RIP రూమర్స్ అంటూ కొట్టిపడేశారు.

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments