Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవర సినిమాలో కృతి సనన్.. హీరోయిన్‌గా నటిస్తుందా?

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (12:02 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాపై ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. 
 
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రంలోని ఈ పాటలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించబోతోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పాట చేయడానికి కృతి సనన్‌ని ఒప్పించారని అంటున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో దేవర సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ దేవర కథ కోసం కొరటాల శివ చాలా నెలలు వర్క్ చేశాడు. మరి కొరటాల శివ కథలో ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. ఇక ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 
 
అంతేకాదు ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. 
 
ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ ఇప్పటికే పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kerala: మహిళను నిప్పంటించి హత్య.. నిందితుడు కూడా మృతి.. ఎలా?

Isro: భారతీయ అంతరిక్ష్ స్టేషన్ మాడ్యుల్ నమూనా ప్రారంభించిన ఇస్రో

Godavari : భారీ వర్షాలు- ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణానదులు

నా తండ్రి హెల్మెట్ ధరించి వుంటే ఇంత జరిగేది కాదు.. హోంగార్డు కుమారుడి సందేశం వైరల్

Telanagana doctor posts: తెలంగాణలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments