Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అంజనీపుత్ర' క్రిష్ దర్శకత్వంలో రామ్ చరణ్... పేరేంటో తెలుసా?

అంజనీపుత్ర క్రిష్ అలియాస్ జాగర్లమూడి క్రిష్. చేసింది నాలుగే చిత్రాలు అయినప్పటికీ... ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నాడు. తాజాగా బాలకృష్ణ హీరోగా చేసిన "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రం సంక్రాంతి క

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (06:02 IST)
అంజనీపుత్ర క్రిష్ అలియాస్ జాగర్లమూడి క్రిష్. చేసింది నాలుగే చిత్రాలు అయినప్పటికీ... ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నాడు. తాజాగా బాలకృష్ణ హీరోగా చేసిన "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ చిత్రంతో దర్శకుడిగా మరో మెట్టు పైకెక్కాడు. 
 
దీంతో క్రిష్ సినిమా చేసేందుకు అగ్ర హీరోలే కాకుండా, యువ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్‌తో క్రిష్ తదుపరి చిత్రం ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రం పేరు రాయబారి. స్పై థ్రిల్లర్ మూవీ.
 
వాస్తవానికి ఈ చిత్రాన్ని మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్‌తో క్రిష్ తొలుత ప్లాన్ చేశాడు. కానీ, ఎందుకనో ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు. వరుణ్ తేజ్ - ప్రగ్యా జైశ్వాల్ జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'కంచె' తర్వాత రాయబారిని పట్టాలెక్కించేందుకు క్రిష్ ఎంతగానే ప్రయత్నించినట్టు సమాచారం. 
 
అయితే, ఇప్పుడు చరణ్ హీరోగా 'రాయబారి' ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇందుకు కారణం సుకుమార్ చిత్రం తర్వాత ఓ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేస్తానని చరణ్ ప్రకటించడమే. క్రిష్ 'రాయబారి' స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథే. అయితే, ఈ ప్రాజెక్టుపై క్రిష్ లేదా రామ్ చరణ్ ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. నిజంగా ఈ ప్రాజెక్టు పట్టాలపైకెక్కితే.. ఈ తరహా స్పై థ్రిల్లర్ మూవీ రావడం టాలీవుడ్‌లో ఇదే మొదటి సారి అవుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తే ఎట్లుంటుంది? (Video)

Republic Day: గణతంత్ర దినోత్సవం.. ఆగస్టు 15.. జెండా ఆవిష్కరణలో తేడా ఏంటంటే? (video)

Mumbai crime: 75ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి?

YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల

DJ Tillu Song: DJ టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments