"ఖైదీ నంబర్ 150"లో చిరంజీవి 'చింపిఫైడ్'... మంచు లక్ష్మి ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" సినీ ప్రముఖులు కూడా విపరీతంగా చూస్తున్నారు. దీనికి కారణం 9 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత చిరంజీవి వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో చిరంజీవి నటన ఏ విధ
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" సినీ ప్రముఖులు కూడా విపరీతంగా చూస్తున్నారు. దీనికి కారణం 9 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత చిరంజీవి వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో చిరంజీవి నటన ఏ విధంగా ఉందోనన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలో నెలకొంది. దీంతో ప్రతి ఒక్కరూ సినీ థియేటర్లకు క్యూకడుతున్నారు. ఇలాంటివారిలో మంచు లక్ష్మి కూడా ఒకరు.
గురువారం ఖైదీ మూవీ చూసిన మంచు లక్ష్మి తనదైన స్టైల్లో స్పందించారు. లాంగ్ గ్యాప్ తర్వాత చిరు చేసిన మూవీ మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడా మిస్ కాకుండా ఎంటర్టైన్ చేసిందంటూ ట్వీట్ చేసింది. అయితే ఇలా సింపుల్‌గా ట్వీట్ చేస్తే మంచు లక్ష్మి స్పెషాలిటీ ఏముంది.. అందుకే ఖైదీ మూవీతో చిరు చింపిఫైడ్ అంటూ తన స్టైల్లో ట్వీట్ చేసింది.
ఖైదీ మూవీతో చిరంజీవి చింపేసాడని చెప్పడానికి 'చింపిఫైడ్' అంటూ కొత్త వర్డ్ కనిపెట్టీంది సొట్టబుగ్గల సుందరి. చింపిఫైడ్ మెగా అభిమానులకి బాగా నచ్చేసింది కూడా. ఇక ఖైదీ ప్రొడ్యూసర్ రాంచరణ్‌ని కూడా పొగుడుతూ ట్వీట్ చేసింది. ప్రొడ్యూసర్‌గా ఫస్ట్ మూవీతోనే మెగా సక్సెస్ ఇచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్ రాంచరణ్‌ని చూస్తే గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది.
Lakshmi Manchu (@LakshmiManchu) January 11, 2017
Just saw Chiru chimpified. What a powerful msg w commercial elements. as a producer made us proud.