Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర కంటే యుద్ధం డోస్ ఎక్కువైన శాతకర్ణి... బాహుబలి ప్రభావమేనా..!

తెలుగు వారి పురాతన చరిత్రకు, శాతవాహన వైభవానికి, అమరావతి రాజసానికి పట్టం గడతామంటూ చెప్పుకుని ముందుకొచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణిలో చరిత్ర పక్కకు వెళ్లి యుద్ధ కండూతికి, యుద్ధ సన్నివేశాలకు ప్రాముఖ్యం ఇవ్వడం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (03:43 IST)
సంక్రాంతికి సరికొత్త శోభను తీసుకొస్తూ సందడి చేసిన రెండు అగ్ర సినిమాలు బాక్స్ ఆఫీసును బద్దలు కొట్టాయనడంలో సందేహం లేదు. రైతు, నీరు వంటి సామాజిక సమస్యలకు పట్టం గట్టిన సినిమా ఖైదీ నంబర్ 150 కాగా, 2 వేల ఏళ్లుగా మరుగున పడిన శాతవాహనుల చరిత్రను వెలికి తీసి తెలుగు ప్రజల భావోద్వేగాలను రంజింపజేసిన సినిమా గౌతమీపుత్ర శాతకర్ణ. ఈ రెండు సినిమాలూ కేవలం హీరోల వన్ మ్యాన్ షో ప్రాతిపదికన ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్‌ను లిఖించుకున్నవే. 
 
ముఖ్యంగా తెలుగు ఒరిజనల్ కథతో ముందుకొ్చ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి... తెలుగు వారు గర్వంగా చెప్పుకోవాల్సిన ఘన చరిత్రకు అద్భుత దృశ్యరూపం అంటూ మీడియా, అభిమానులు, సగటు ప్రేక్షకులూ బాలయ్య సినిమాకు దాసోహం అయినమాట వాస్తవం. కానీ తెలుగు వారి పురాతన చరిత్రకు, శాతవాహన వైభవానికి, అమరావతి రాజసానికి పట్టం గడతామంటూ చెప్పుకుని ముందుకొచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణిలో చరిత్ర పక్కకు వెళ్లి యుద్ధ కండూతికి, యుద్ధ సన్నివేశాలకు ప్రాముఖ్యం ఇవ్వడం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
 
అతి తక్కువ సమయంలో కేవలం 80 రోజుల్లో రికార్డు స్థాయిలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న శాతకర్ణి సినిమా చరిత్ర కంటే యుద్ధ దృశ్యాలకు పట్టం కట్టి కమర్షియల్ విలువలు పునాదిగా ముందుకు రావడానికి కారణాలేవి? ఇన్నాళ్లుగా చిన్న బడ్జెట్ సినిమాలను వేగంగా తీసుకుంటూ పోయిన క్రిష్.. బాలకృష్ణ వంటి అగ్రనటుడి సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చేసరికి, రిస్కు తీసుకోకుండా పూర్తిగా కమర్షియల్ విలువలను హైలైట్ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 
 
ఒక సమీక్షలో పేర్కొన్నట్లు శాతకర్ణి గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెళ్లినట్టయితే ఈ చిత్రంలో మనకి లభించేది అరకొర ఇన్‌ఫర్మేషనే. బాలయ్య వందవ చిత్రాన్ని ఆస్వాదించడానికి వెళితే మాత్రం పెట్టిన పైసలకి తగ్గ ఎంటర్‌టైన్‌మెంట్‌ లభిస్తుంది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' పరిపాలనా దక్షతా, వ్యవహార శైలి, ఆలోచనా విధానాలు, చేపట్టిన సంస్కరణలు వగైరా విషయాలపై క్రిష్‌ దృష్టి పెట్టలేదు. క్రిష్ ఎంచుకున్న రాజప్రాసాదాలు, యుద్ధ రంగాలు.. అలనాటి శాతకర్ణి వైభవాన్ని కళ్లకు కట్టాయి. ప్రతీ ఫ్రేమ్ లోనూ శాతవాహనుల రాజసం కనిపించేలా తెరకెక్కించడమే శాతకర్ణి సక్సెస్‌కు మూల కారణం. 
 
కేవలం రెండుంపావు గంటల నిడివి ఉన్న ఈ చిత్రంలో డ్రామాకి కనీసం పావు వంతు స్కోప్‌ కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.. సినిమాను పూర్తిగా  యుద్ధ సన్నివేశాలతో నింపేసారు. ఇందులో శాతకర్ణి చేసిన యుద్ధాల్లో మూడింటిని కవర్‌ చేశారు. అందులో మొదటిది కేవలం పాత్ర పరిచయానికి మాత్రం వాడుకున్న యుద్ధ సన్నివేశం కాగా, రెండవది సుదీర్ఘంగా సాగుతూ దాదాపు ముప్పావు వంతు ప్రథమార్ధాన్ని అదే కవర్‌ చేసేస్తుంది. చిత్రం ద్వితియార్ధంలో సింహభాగం ఈ యుద్ధ సన్నివేశాలే ఉంటాయి. 
 
తెలుగువారు గర్వించే ధీరత్వాన్ని ప్రదర్శించిన శాతకర్ణి ధైర్య సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి కానీ, క్రిష్‌లాంటి దర్శకుడు తీసిన చిత్రంలో కేవలం యుద్ధాలు మినహా ఎక్కువ వివరాలు లేకపోవడం నిరాశ పరుస్తుంది. శాతకర్ణి గురించిన పూర్తి అవగాహన ఇవ్వడంలో ఈ చిత్రం విజయవంతం కాలేదనే చెప్పాలి. తెలుగువారికి సహజసిద్ధమైన భావోద్వేగాలను హైలైట్ చేయడంలో మాత్రం శాతకర్ణి బ్రహ్మాండమైన విజయం సాధించింది.  
 
శాతకర్ణి చరిత్ర కంటే బాలకృష్ణ రౌద్ర రస పూరిత నటన, సాయిమాధవ్‌ బుర్రా అత్యద్భుతమైన సంభాషణలు ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలిచాయి. తప్పితే ఈ చిత్రం చూసిన తర్వాత ఇంతమందిపైన యుద్ధం చేసాడు, ఒక యుద్ధానికి పసిడి ప్రాయంలోని తన కొడుకుని వెంట తీసుకెళ్లాడు లాంటి విశేషాలు తప్ప శాతకర్ణి  గురించి లోతయిన వివరాలేం తెలీదంటే అది బాలకృష్ణ లోపం కాదు.
 
యుద్ధ సన్నివేశాలు జనాలను మంత్రముగ్ధులు చేస్తాయన్న విషయాన్ని బాహుబలి చిత్రం తొలిసారిగా వెండితెరపై ప్రదర్సించింది. శాతకర్ణి సినిమా నిర్మాణంలో కూడా బాహుబలి దర్శకుడు రాజమౌళిని ఒక సందర్భంలో కలుసుకున్న క్రిష్ యుద్ధ సన్నివేశాలతోటే సినిమా మొత్తాన్ని నడిపించవచ్చన్న పాఠం నేర్చుకున్నాడేమో.. అందుకే సినిమా మొత్తంలో గ్రాండియర్ అని చెప్పుకుంటున్న భారీతనం యుద్ధ సన్నివేశాల్లోనే కనిపిస్తుంది. 
 
యుద్ధాన్ని బీభత్సంగా, క్రూరంగా కాకుండా ఆద్యంతం ఆస్వాదించేలా రమణీయంగా తీయడంతో జనాలను ఆకట్టుకునే చరిత్రకు నాంది పలికింది బాహుబలి కాగా, క్రిష్ తన గౌతమీ పుత్ర శాతకర్ణితో దాన్ని మరొక కొత్త మెట్టుకు తీసుకుపోయాడు. టాలీవుడ్‌ని, బాలీవుడ్‍‌ని కొన్నేళ్ల పాటు యుద్ధ సినిమాలే ఏలనున్నాయనేందుకు బాహుబలి, శాతకర్ణి ఒక నమూనాలుగా నిలిచిపోతాయేమో మరి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

15 చోట్ల పగిలిన తల... 4 ముక్కలైన కాలేయం... బయటకొచ్చిన గుండె... జర్నలిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు!

ఓయో రూమ్స్: బుకింగ్ పాలసీలో ఆ సంస్థ తెచ్చిన మార్పులేంటి? జంటలు తమ రిలేషన్‌కు ఆధారాలు ఇవ్వాలని ఎందుకు చెప్పింది?

భర్త పిల్లలను వదిలేసి బిచ్చగాడితో పారిపోయిన మహిళ.. ఎక్కడ?

పులిని చుట్టుముట్టిన సఫారీ వాహనాలు.. హైకోర్టు సీరియస్ (Video)

పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు... ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments