Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ చెప్పిందాంట్లో తప్పేముంది.. వెనకేసుకొస్తున్న బాలయ్య ప్యాన్స్

అటు చిరంజీవి ఖైదీ నంబర్ 150, ఇటు బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు ఒక రోజు తేడాతో విడుదలై సంక్రాంతిని అభిమానుల సంబరాల పండగగా మార్చేశాయి. ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో బాహుబలి తర్వాత ఇంత హైప్‌ సృష్టించిన సినిమాలు లేవన్నంతగా ఈ రెండు చిత్రాలు బ

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (02:52 IST)
రెండు మద గజాలు ఢీ కొంటే ఏమవుతుందో అందరికీ తెలిసిన విషయమే.. అటు చిరంజీవి ఖైదీ నంబర్ 150, ఇటు బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు ఒక రోజు తేడాతో విడుదలై సంక్రాంతిని అభిమానుల సంబరాల పండగగా మార్చేశాయి. ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో బాహుబలి తర్వాత ఇంత హైప్‌ సృష్టించిన సినిమాలు లేవన్నంతగా ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద చెలరేగిపోయిన మాట నిజమే. కానీ నిజం మాట్లాడుకుంటే రాంగోపాల్ వర్మ అభిప్రాయాలే సరైనవేమో అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది. 
 
ఎందుకంటే.. చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన కలెక్షన్స్ ను సాధించిన మాట ఎంత వాస్తవమో, విమర్శకుల, ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టలేదన్న మాట కూడా అంతే వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే నిస్పక్షపాతంగా మాట్లాడే మెగా అభిమానులు సైతం చిరంజీవి రీ ఎంట్రీ సినిమా పట్ల పెదవి విరుస్తున్నారు. కేవలం డ్యాన్స్ లు, ఫైట్లు కోసం తీసిన సినిమా మాదిరి ఉంది గానీ, మెగాస్టార్ 150వ సినిమా స్థాయికి తగిన సినిమా కాదని విమర్శిస్తున్నారు.

చివరకు ఒరిజనల్ చిత్ర దర్శకుడు మురగదాస్ కూడా ఖైదీ నంబర్ 150 సినిమా చిత్రీకరణ విధానం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడంటే ఎక్కడో లోపం జరిగిందన్నదే తెలుస్దోంది. కానీ ఖైదీ 150 సినిమాకు డబ్బులకు డోకా లేదు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ వారాంతం నాటికే సినిమా పెట్టుబడి ఖర్చులు వచ్చేస్తాయని సినీ పండితులు చెబుతున్నారు. కానీ ఎక్కడో ఏదో లోపం ఉందన్న అనుమానం మాత్రం బలపడతోంది. 
 
మరో వైపు చారిత్రాత్మక కధతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించలేదేమో గానీ, ‘100వ సినిమా అంటే ఇలాగే ఉండాలి’ అని సినీ విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించే విధంగా ఉందన్న టాక్‌ను తెచ్చుకుంది.

కొన్ని కొన్ని సన్నివేశాలలో బాలయ్య మేకప్ కాస్త సరితూగనప్పటికీ, ఈ సినిమాను చేయాలంటే ఒక్క బాలకృష్ణ తప్ప మరొకరు లేరు అన్న అద్భుతమైన స్పందనను తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యింది. ఇదీ తెలుగు సినిమా అన్నంత క్రేజ్ వచ్చేసింది. బాలకృష్ణ స్టామినాను ఎక్కడికో తీసుకెళ్లిన సినిమాగా శాతకర్ణి చరిత్రలో నిలబడిపోతుందంటున్నారు విమర్శకులు. 
 
సీనీ పండితులు, విమర్శకులు, అభిమానులు మూకుమ్మడిగా చేస్తున్న ఈ విశ్లేషణలను ఆధారంగా తీసుకుని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సెటైర్‌తో సోషల్ మీడియా ముందుకు వచ్చేసారు. ఖైదీ 150 సినిమా విడుదల నేపథ్యంలో గత 3 రోజులుగా మౌనంగా ఉన్న వర్మ శాతకర్ణి సినిమా విడుదలైందే తడవుగా మరోసారి మెగా క్యాంపుపై మెగా విమర్శలకు దిగిపోయారు.  బయటినుంచి ‘అరువు’ కధతో ఓ తెలుగు సినిమా 10 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళగా,  2000 సంవత్సరాల క్రితం నాటి నిజమైన కధతో తెలుగు సినిమాను శాతకర్ణి మరో 10 ఏళ్ళు ముందుకు తీసుకువెళ్లిందని ట్విట్టర్ వేదికగా మరోసారి మెగా మూవీని టార్గెట్ చేసుకుంటూ వ్యాఖ్యలు చేసాడు వర్మ. 
 
వర్మ మాటలు కాస్త కటువుగా ఉంటాయి గానీ, అందులో నిజం లేకపోలేదు అంటూ మద్దతు పలుకుతున్నారు నెటిజన్లు. ఇక బాలకృష్ణ అభిమానుల మాట చెప్పనవసరం లేదు. ఈ ఒక్క వ్యాఖ్యతో వర్మ బాలయ్య అభిమానులకు ఆప్తుడైపోయారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్ AP Dy CM Pawan Kalyan inaugurates 35th Book Festival in Vijayawada AP Dy CM Pawan Kalyan, Inaugurates, 35th Book Festival,

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments