Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్ 'పందెం కోడి'తో బిజీగా వుంటోందా?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (17:57 IST)
ఒకే ఒక్క సినిమాతో పాపులర్ హీరోయిన్ అయ్యారు కీర్తి సురేష్‌. తెలుగు, తమిళ చిత్ర సీమలో కీర్తి సురేష్‌కు మంచి పేరే ఉంది. మొదట్లో ప్రేమ కథా చిత్రాల్లో నటించినా ఆ తరువాత యాక్షన్ సినిమాల్లో కూడా నటించి తానేంటో నిరూపించుకున్నారు. కీర్తి సురేష్‌ సినీ పరిశ్రమలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరినీ ప్రేమించలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఒక హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందట.
 
ఆయనెవరో  కాదు ప్రముఖ హీరో విశాల్. వీరిద్దరు కలిసి పందెం కోడి-2 సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. సినిమా షూటింగ్‌లో విరామం దొరికితే చాలు వీరిద్దరు కలిసి చాలాసేపు కబుర్లలో గడిపేవారట.
 
కీర్తి సురేష్‌, విశాల్ జంటగా నటించిన సినిమా ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కాబోతోంది. అయితే వీరి మధ్య మాత్రం ప్రేమ అలాగే కొనసాగుతోందని తమిళ సినీపరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తమిళ సినీ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్ తను బిజీగా ఉన్నా కూడా కీర్తి సురేష్‌ కోసం కాస్త సమయాన్ని కేటాయిస్తున్నారట. ప్రతిరోజు ఫోన్‌లో చాటింగ్ చేయడమో.. లేక నేరుగా కలవడమో లాంటివి చేస్తున్నారట విశాల్. ఇదంతా ప్రేమేనా లేదంటే సినిమా ప్రమోషన్లో భాగమో మరికొన్నిరోజులు పోతే కానీ తెలియదు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments