Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్ కమెడియన్‌ని పెళ్లి చేసుకుందా..

కోలీవుడ్ అందాల నటి కీర్తి సురేష్ తాజాగా తమిళ కమెడియన్ సతీష్‌ను వివాహం చేసుకుందని ఒక్కసారిగా కోలీవుడ్‌లో ప్రచారం మొదలైంది. ఇటీవలి కాలంలో సతీష్ కమెడియన్‌గా బాగా ఎదుగుతున్నాడు. పలు సినిమాల్లో కీలక పాత్రల

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (11:31 IST)
కోలీవుడ్ అందాల నటి కీర్తి సురేష్ తాజాగా తమిళ కమెడియన్ సతీష్‌ను వివాహం చేసుకుందని ఒక్కసారిగా కోలీవుడ్‌లో ప్రచారం మొదలైంది. ఇటీవలి కాలంలో సతీష్ కమెడియన్‌గా బాగా ఎదుగుతున్నాడు. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. కీర్తితో పెళ్లటగా అని ఈ తమిళ నటుడి వద్ద ప్రస్తావిస్తే, పెద్దగా నవ్వేస్తూ, "అసలు కీర్తికి నాకు సంబంధమే లేదు.. మరి, ఈ వార్తని ఎవరు పుట్టించారో!" అంటున్నాడు. నేను శైల‌జ‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తాజాగా నాని, బ‌న్ని చిత్రాల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉంది కీర్తి. 
 
అలాంటిది ఈ స‌డెన్ మ్యారేజ్ ఏంట‌ని షాక్ అవుతున్నారు సినీ జ‌నాలు. దీనికి ఈ ఫోటోలే సాక్ష్య‌మంటున్నారు కొంద‌రు. కోలీవుడ్ వెబ్‌సైట్‌లు ఈ ఫోటోల‌ను బాగా ప్ర‌మోట్ చేసి.. సోష‌ల్ మీడియాలో హంగామా చేశాయి. ఈ విషయం కీర్తి సురేష్ దాకా వ‌చ్చింది. అంతే ఈ విషయం పట్ల ఆమె ఘాటుగా స్పందించింది. రీసెంట్‌గా విజ‌య్ సినిమా షూటింగ్ కోసం తీసిన ఫోటోల‌ను కొంద‌రు కావాల‌నే ఎడిటింగ్ చేసి ఈ ఇద్ద‌రికి పెళ్ల‌యింద‌ని ప్ర‌చారం చేశారు. అయితే, ఆమె మెడలో దండ‌ల‌ను అంద‌రికీ వేశారు. 
 
కానీ, ఫోటో ఎడిటింగ్‌లో వారు మిగ‌తావారిని డిలీట్ చేసి.. కేవ‌లం ఈ ఇద్ద‌రిని మాత్ర‌మే ఉంచారు. దీంతో, నిజంగానే కీర్తి సురేష్‌కి స‌తీష్‌కి మ్యారేజ్ అయిందని పుకార్లు పుట్టించారు. అదంతా అబ‌ద్ధం అని చివ‌రికి కీర్తి సురేష్ వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో.. ఆ ప్ర‌చారానికి తెర‌ప‌డింది. కానీ, కొన్ని గంట‌ల‌పాటు సోష‌ల్ మీడియా ఈ ఫోటోల‌తో కలకలం రేగింది. కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న స‌మ‌యంలో కీర్తి సురేష్‌పై వ‌చ్చిన రూమ‌ర్‌లు బిగ్ షాకింగ్‌గా మారాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments