Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్ను తెగ వాడేశారు: కంగనా రనౌత్

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్ అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నటనలో ఈ అమ్మడిని బీట్‌ చేసేవారు సమీప భవిష్యత్తులో ఎవరూ లేరనే అంటారు. అది నిజం కూడా! తనకు తానే నెంబర్‌‌వన్‌ హీరోయిన్‌ అని చెప్పుకోగల ధైర్

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (12:43 IST)
బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్ అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నటనలో ఈ అమ్మడిని బీట్‌ చేసేవారు సమీప భవిష్యత్తులో ఎవరూ లేరనే అంటారు. అది నిజం కూడా! తనకు తానే నెంబర్‌‌వన్‌ హీరోయిన్‌ అని చెప్పుకోగల ధైర్యం ఉన్న ఏకైక స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్. తన నటనతోనే కాదు, నోటి వాచాలత్వంతోనూ అందరికీ వణుకు పుట్టించగల హాట్‌లేడీ. 
 
వెండితెరకు వచ్చే హీరోయిన్లను హీరోలు, దర్శకనిర్మాతలు ఎలా వాడుకుంటారన్న అంశంపై ఆమె స్పందిస్తూ... సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్నూ వాడుకున్నారు. అసలు స్టార్‌ హీరోయిన్లు అందరూ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నవారే. ఎవరో కొందరు కుటుంబ నేపథ్యం ఉన్నవారు తప్పించి చాలామందికి నాకు ఎదురైన, జరిగిన అనుభవాలే జరిగాయి. ఇవన్నీ జగమెరిగిన సత్యాలే! నేను ఆ విషయాలే చెబితే కొందరు భుజాలు తడుముకుంటున్నారు. 
 
నేను అన్న మాటలు తప్పు అని ఎవరూ ఇంతవరకూ పబ్లిక్‌గా స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. అలాగే ఒక చిత్రానికి ఎంత తీసుకోవాలి అన్నది హీరోయిన్‌ ఇష్టం. ఆ సినిమాకి దీపిక అంతే తీసుకుంటోంది కదా? మీరు అంత అడుగుతున్నారెందుకు? లాంటి ప్రశ్నలకు జవాబులు ఉండవు. దానికి ఇంకా టైముంది. అసలు పెళ్ళి గురించిన ఆలోచనే నాకు లేదు. ఎలా పెళ్ళి చేసుకోవాలి? అన్నదాంట్లో ఇంకా క్లారిటీ కూడా రాలేదు. అలాంటప్పుడు దాని గురించి మాట్లాడడంలో అర్థం లేదు. ఓ రెండు మూడేళ్ళ తరువాత ఆలోచిస్తాను.
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments