Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ అగర్వాల్ పెళ్లి - ఆచార్యకు తిప్పలు

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (21:16 IST)
మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో ఆచార్య ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
 
అయితే... ఏ ముహుర్తాన ఆచార్య సినిమాను స్టార్ట్ చేసారో కానీ... అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఆచార్య కథ ఓకే అయిన తర్వాత చిరంజీవి డేట్స్ కోసం చాన్నాళ్లు వెయిట్ చేసాడు కొరటాల. 
 
సైరా నరసింహారెడ్డి సినిమా పూర్తి చేసుకుని ఆచార్య స్టార్ట్ చేసిన తర్వాత షూటింగ్ అనుకున్నంతగా ముందుకు వెళ్లలేదు. స్పీడు పెంచి షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రను ఎవరు చేస్తే బాగుంటుంది అని ఆలోచనలో పడ్డారు.
 
ఒకసారి రామ్ చరణ్ అనుకుంటే.. మరోసారి మహేష్‌ బాబుతో చేయిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనలో పడ్డారు. ఆఖరికి చరణ్‌‌తో ఫిక్స్ అయ్యారు. అయితే... చరణ్‌ ఆర్ఆర్ఆర్‌లో బిజీలో ఉండడం వలన ఆలస్యం అయ్యింది. ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకుని వస్తాడనుకుంటే.. కరోనా కారణంగా ఆగింది. ఇలా ఆచార్యకు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి.
 
ఇప్పుడు ఎట్టకేలకు స్టార్ట్ అయ్యింది అనుకుంటే... కాజల్ రూపంలో మరో అడ్డంకి రాబోతుంది అని తెలిసింది. ఇంతకీ మేటర్ ఏంటంటే... కాజల్ రీసెంట్‌గా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనుందని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే... ఆచార్యకు మళ్లీ కష్టాలే. మరి... ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments