Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌కి నో చెప్పి కుర్ర హీరోతో సై అన్న టాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీ ఆర్ సరసన నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది చెప్పండి. ఈ హీరోతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేస్తుంది. కానీ యంగ్ టైగర్ సినిమాలో నటించడానికి ఒక హీరోయిన

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (16:30 IST)
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది చెప్పండి. ఈ హీరోతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేస్తుంది. కానీ యంగ్ టైగర్ సినిమాలో నటించడానికి ఒక హీరోయిన్ తిరస్కరించిందట. ఆమె ఎవరో కాదు కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతిహాసన్. టాలీవుడ్‌లో ఎన్.టి.ఆర్‌కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. 
 
అయితే అలాంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ వస్తే కాదని ఓ కుర్ర హీరో సినిమాకు స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడేందుకు సిద్ధమైంది హాట్ బ్యూటీ శృతి హాసన్. యంగ్ టైగర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న జనతా గ్యారేజ్‌లో ఐటం సాంగ్ కోసం ముందు శృతి హాసన్‌ని దర్శకనిర్మాతలు సంప్రదించారట. కాని కొన్ని కారణాలతో శృతి హాసన్ ఆ ఐటం సాంగ్‌ని సున్నితంగా తిరస్కరించిందట. 
 
అయితే ఎన్.టి.ఆర్ స్పెషల్ సాంగ్ అంటే డేట్స్ లేవు అంటూ తప్పించుకున్న శృతి హాసన్ ఇప్పుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా చేస్తున్న 'జాగ్వార్' సినిమాలో స్పెషల్ సాంగ్‌కు‌ సై అంటోంది. రూ.70 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉండేందుకు దాదాపు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి మరి శృతి హాసన్‌తో దర్శకనిర్మాతలు ఐటం సాంగ్ ప్లాన్ చేశారట. శృతి కాదన్న తర్వాత చాలామందిని చూసి చివరకు కాజల్‌తో ఎన్టీ ఆర్ అడ్జస్ట్ అయ్యాడు. అదండీ సంగతి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments