Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన హనీమూన్... షూటింగులకు సిద్ధమంటున్న కాజల్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (15:22 IST)
టాలీవుడ్ సీనియర్ నటి కాజల్ అగర్వాల్. గత నెల 30వ తేదీన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తన భర్తతో కలిసి మాల్దీవులకు హనీమూన్ కోసం వెళ్లారు. అక్కడ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి, ఓ ప్రైవేట్ రిసార్ట్స్ తీసుకుని సముద్ర గర్భంలో హనీమూన్ చేసుకున్నారు. ఈ హనీమూన్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె ఎప్పటికపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. అలా వారం రోజుల పాటు మాల్దీవుల్లో విహరించిన కాజల్.. ఇపుడు తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ముంబైకు చేరుకుంది. అంతేనా, తాను సంతకాలు చేసిన మూవీ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆమె సమాయత్తమవుతోంది. 
 
అందులోభాగంగా, మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న "ఆచార్య" చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు పచ్చజెండా ఊపింది. కాగా, ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 20 తేదీ నుంచి ప్రారంభంకానుంది. నిజానికి ఈషూటింగ్ ఈ నెల 9వతేదీ నుంచే ప్రారంభంకావాల్సివుంది. అయితే, చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత టెస్టింగ్ కిట్‌లో లోపం వల్ల చిరంజీవికి పాజిటివ్ అని వచ్చిందనీ, ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు తేలింది. దీంతో ఆచార్య షూటింగులో కూడా చిరంజీవి పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కాజల్ కూడా వచ్చేందుకు సిద్ధమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments