'అర‌వింద స‌మేత' ప‌బ్లిసిటీ వీక్... ఎన్టీఆర్ పీఆర్ టీం నిద్రపోతోందా..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాని హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించింది.

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (21:25 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాని హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించింది. ఇషా రెబ్బా ముఖ్య పాత్ర పోషించింది. ఇటీవ‌ల రిలీజైన పాట‌ల‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. ముఖ్యంగా ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాట‌ల్లో పెనివిటి అనే పాట‌కు విశేష స్పంద‌న ల‌భించింది. 
 
ద‌స‌రా కానుక‌గా ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది ఈ చిత్రం. అయితే... రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుంది కానీ.. ప‌బ్లిసిటీ మాత్రం అంత‌గా క‌నిపించ‌డం లేదు. ఎన్టీఆర్‌కి ప్ర‌త్యేకంగా పీఆర్ టీమ్ ఉంది. అలాగే డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌కి పీఆర్ టీమ్ ఉంది. కానీ... ఎందుక‌నో ఈ సినిమాకి ప‌బ్లిసిటీ ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఫీల‌వుతున్నార‌ట‌. దసరా పండుగ ఎంతో దూరంలో లేదు... పీఆర్ టీం నిద్రపోతోందా అని గుర్రుమంటున్నారట. అస‌లు ఎందుకు ఇలా జ‌రుగుతుంది అంటే.. ఎప్పుడు ఏది రిలీజ్ చేయాలి అన్నా.. అంతా త్రివిక్ర‌మ్ చెప్పాలి అనే స‌మాధానం వ‌స్తుందట‌. 
 
అజ్ఞాత‌వాసి అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో బాగా కేర్ తీసుకుంటున్నార‌ట మాట‌ల మాంత్రికుడు. అందుక‌నే టీజ‌ర్, ట్రైల‌ర్, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఇలా.. ప్ర‌తిదీ ముహుర్తం చూసుకుని రిలీజ్ చేస్తున్నార‌ట‌. అంతా బాగానే ఉంది. కాక‌పోతే ప‌బ్లిసిటీ పెంచండి మ‌హా ప్ర‌భో అని ఫ్యాన్స్ తెగ కంగారుప‌డుతున్నారు. మ‌రి... ఫ్యాన్స్ బాధ అర్ధం చేసుకుని ఈ మాట‌ల మాంత్రికుడు జోరు పెంచ‌మ‌ని ఆదేశాలు జారీ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments