Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్టోబర్ 11న వచ్చేస్తున్న అరవింద సమేత

అరవింద సమేత సినిమా రిలీజ్‌కు సన్నద్ధమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న అరవింద సమేత వీర రాఘవ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. . ఈ సినిమా అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానుంది. తాజాగా పోస్ట‌ర్స్ కూడా విడుద‌

Advertiesment
aravinda sametha veera raghava
, శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (12:47 IST)
అరవింద సమేత సినిమా రిలీజ్‌కు సన్నద్ధమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న అరవింద సమేత వీర రాఘవ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. . ఈ సినిమా అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానుంది. తాజాగా పోస్ట‌ర్స్ కూడా విడుద‌ల చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ మేరకు దసరా కానుకగా భారీ అంచనాల నడుమ అక్టోబర్-11న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ట్వీట్ చేసింది. 
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఈ దసరాకి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. రెండో హీరోయిన్‌గా ఈషా రెబ్బా 
నటిస్తోంది.
 
ప్ర‌స్తుతం "అర‌వింద స‌మేత" సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. పాటల చిత్రీకరణ అక్కడ జరుగుతోంది. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్.. ముందు ఐదో పాట‌ను తీసేద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు మ‌ళ్లీ పెట్టేస్తున్నాడు. టైమ్ ఇంకా ఉండ‌టంతో మ‌రో పాట‌ను కూడా యాడ్ చేస్తున్నాడు. ఇంకా సినిమాను కూడా దసరాకు రిలీజ్ చేసేస్తున్నాడు. 
 
త్రివిక్రమ్ సినీ కెరీర్‌లో తక్కువ సమయానికి పూర్తి చేసిన సినిమా అరవింద సమేత కావడం విశేషం. దీంతో తక్కువ సమయంలో స్టార్ హీరోతో సినిమా చేసిన దర్శకుడిగా త్రివిక్రమ్ నిలిచాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘంట‌సాల బ‌యోపిక్ - అడ్డుకుంటామంటున్న కుటుంబ స‌భ్యులు