పుష్ప-2 ఐటమ్ సాంగ్‌.. జాన్వీ కపూర్ ఊ.. అంటుందా..?

సెల్వి
శనివారం, 2 మార్చి 2024 (08:52 IST)
పుష్ప-2 ఐటమ్ సాంగ్‌కి రోజుకో వార్త సోషల్ మీడియాలో పుట్టుకొస్తూనే వున్నాయి. పుష్ప-2లో ఐటమ్ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. 
 
అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పుష్ప 2: రూల్‌లో ఐటెం సాంగ్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. దక్షిణాది టాప్ హీరోయిన్ సమంత రూత్‌ ప్రభు పుష్పలో "ఊ అంటావా" ఐటెం సాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  
 
ఈసారి సామ్ కాకుండా.. ట్రెండింగ్ హీరోయిన్‌ను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. ఇందుకోసం నటి జాన్వీ కపూర్‌ని పరిశీలిస్తున్నారు. జాన్వీ కపూర్‌తో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పారితోషికం వర్కౌట్ అయితే.. జాన్వీ ఈ పాటకు ఓకే చెప్పేలా వున్నట్లు సమాచారం. 
 
పుష్ప 2 విడుదలకు దగ్గరవుతున్నందున, త్వరలో పాట షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ యాక్షన్ దేవరలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments