Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్.టి.ఆర్. దేవర, తెలుగు వారి గురించి జాన్వీ కపూర్ ఏమందో తెలుసా

Janhvi Kapoor,

డీవీ

, శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (16:57 IST)
Janhvi Kapoor,
శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ అందరికీ తెలిసిందే. ఆమె తల్లిలాగే వెండితెరపై ఆమెను మరింత ఎక్కువగా చూడాలని కోరుకునే ప్రేక్షకులూ వున్నారు. ముందుగా అందులో ఆమె తండ్రి వున్నారు. తన కుమార్తె కోసం శాయశక్తులా పబ్లిసిటీ చేస్తున్నాడు. ఆమధ్య ముంబై వీధుల్లో వీధుల్లో జిమ్ లోనూ తిరుగుతుంటే పబ్లిసిటీ బాగా చేసేలా చేశాడు. ప్రస్తుతం జాన్వీ మూడు సినిమాలు చేస్తుంది. అందులో తెలుగు సినిమా దేవర ఒకటి. 
 
ఇటీవలి ఇంటర్వ్యూలో, జాన్వీ కపూర్‌ తన రాబోయే దక్షిణాది అరంగేట్రం దేవర గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవర చిత్రంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ చిత్రం ద్వారా తన మూలాలకు దగ్గరగా అయ్యేలా  తెలుగు నేర్చుకుంటున్నానని చెప్పింది. శ్రీదేవి తన దక్షిణాది అరంగేట్రం జూనియర్ ఎన్టీఆర్ తాత N.T రామారావుతో ప్రారంభించారు.
 
జాన్వీ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మాహి, దేవర, ఉలాజ్ వంటి సినిమాలు చేస్తుంది. తనకు తెలుగు నేర్చుకునేలా డైలాగ్ లు అన్నీ ముందుగా వస్తున్నాయి. నేను త్వరలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా తెలుగులో మాట్లాడతాను అంటూ నర్మగర్భంగా చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆహాలో ఆకట్టుకుంటోన్న జోజు జార్జ్ చిత్రం ఆంటోని