Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకన్ బ్యూటీపై కన్నేసిన పవన్ కళ్యాణ్?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (14:36 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో జోరు పెంచారు. వరుస చిత్రాలకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ విడుదలకు సిద్ధమైంది. ఆ తర్వాత ముగ్గురు దర్శకులతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఓ ప్రాజెక్టును దగ్గుబాటి రానాతో కలిసి పవన్ నటించనున్నారు. 
 
ఈ క్రమంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలున్నాయి. 
 
ఈ ప్రాజెక్టులో ఫీమేల్ లీడ్ రోల్‌లో ఎవ‌రు క‌నిపిస్తార‌నే దానిపై ఇప్ప‌టివ‌ర‌కు ర‌క‌ర‌కాల వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. క‌థానుగుణంగా ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లుండ‌గా... క్రిష్ అండ్‌ టీం ఇప్ప‌టికే నిధి అగ‌ర్వాల్‌ను ఓ హీరోయిన్‌గా ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌క‌టించింది.
 
మ‌రో హీరోయిన్‌గా బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును ఫైన‌ల్ చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నున్న‌ట్టు తెలుస్తోంది. 
 
జాక్వెలిన్ గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌న‌ట్వంటి రోల్‌లో క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. డైరెక్ట‌ర్ క్రిష్‌కు బాలీవుడ్‌తో మంచి కాంటాక్ట్స్ ఉండ‌టంతో. జాక్వెలిన్‌ను కీల‌క పాత్ర కోసం డేట్స్ సర్దుబాటు చేసే ప‌నిలో ఉన్న‌ట్టు చ‌ర్చ న‌డుస్తోంది.
 
జాక్వెలిన్‌కు ఇప్ప‌టికే ఎన్టీఆర్ హీరోగా న‌టించిన రామ‌య్యా వ‌స్తావ‌య్యా చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసింది. ఈ శ్రీలంక భామ ఈ సారి పూర్తిస్థాయి రోల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments