Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీ కోరిక ఏమిటో కూడా నాకు తెలుసు'... రష్మితో 'జబర్దస్త్' సుధీర్

'జబర్దస్త్' షో కామెడీతో పాటు యాంకర్ రష్మి చిట్టి పొట్టి డ్రెస్సులతో ఆ షోని మరింత హిటేక్కించింది. ఇదిలా ఉంటే... రష్మిగౌతమ్, జబర్దస్త్ కామెడీ షో టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని కొంతకాలంగా సో

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (10:18 IST)
'జబర్దస్త్' షో కామెడీతో పాటు యాంకర్ రష్మి చిట్టి పొట్టి డ్రెస్సులతో ఆ షోని మరింత హిటేక్కించింది. ఇదిలా ఉంటే...
రష్మిగౌతమ్, జబర్దస్త్ కామెడీ షో టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం జబర్దస్త్ స్కిట్లు చేసేప్పుడు కూడా టీమ్ మెంబర్స్ ఇద్దరిపై సెటైర్లు వేయడం ఓ కారణం అయితే, రష్మి, సుధీర్ కూడా చాలా సన్నిహితంగా ఉండడం చూసి ఎవ్వరికైనా ఈ అనుమానం రాక తప్పదు. జబర్దస్త్ కామెడీ షోలో సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని, ప్రస్తుతం పీకల్లోతు ఎఫైర్లో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారంటూ కొంతకాలంగా రకరకాల ప్రచారం జరుగుతోంది. 
 
అయితే ఇవన్నీ ఇప్పటివరకు కేవలం గాసిప్స్‌గానే ఉండిపోయాయి. నిజా నిజాలు ఏమిటనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే... తనకున్న కోరికను సుడిగాలి సుధీర్ ఢీ జోడి ప్రోగామ్‌లో చెప్పాడు. ఎప్పటికైనా ఢీ జోడి అయ్యేలోపు ఒక్కసారైనా డాన్స్ చేయాలని ఉందని తన మనసులోని మాటను చెప్పాడు. ఇంకా యాంకర్ రష్మితో చెబుతూ... నీ కోరిక కూడా తీరుద్దామని అనుకుంటున్నానని చెబుతూ.. రష్మి దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేశాడు. 
 
రష్మి భుజంపై చేయి వేసి.. 'నీ కోరిక ఏమిటో కూడా నాకు తెలుసు' అని చెప్పేలోపే.. రష్మి ఒక్కసారిగా సుడిగాలి సుధీర్‌ని పక్కకి నెట్టేసింది. 'గ్యాప్ మైంటైన్ చేయి.. ఛాన్స్ దొరికితే.. చెయ్యి  పెడతావ్' అంటూ పక్కకి తోసింది. దీనితో అక్కడే ఉన్న ప్రదీప్ ఒక్కసారిగా నివ్వెరపోయాడు. సుడిగాలి సుధీర్‌కి కూడా ఏమి చేయాలో తెలియలేదు. ఇంతలో జడ్జ్‌లు అందరూ నవ్వగానే.. లైట్‌గా తీసుకున్నారు. ఆ తరువాత అందరూ లైట్‌గా తీసుకోవడంతో.. షాక్‌లో ఉన్న సుడిగాలి సుధీర్ భుజంపై రష్మి చేయి వేసి ఓదార్చింది. దీనితో వివాదం సర్దు మణిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments