Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట చేసి కాబోయే అత్తకు వడ్డించిన నయనతార... మురిసిపోయిన ప్రియుడు

హీరోయిన్ నయనతార నటిగానే కాదు వ్యక్తిగతంగానూ వార్తలోకి ఎక్కడం అన్నది పరిపాటిగా మారింది. ఈ ముద్దుగుమ్మ తాజా ప్రియుడు దర్శకుడు విఘ్నేశ్‌ శివ అనే ప్రచారం మీడియాలో హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ''నానుమ్ ర

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (09:51 IST)
హీరోయిన్ నయనతార నటిగానే కాదు వ్యక్తిగతంగానూ వార్తలోకి ఎక్కడం అన్నది పరిపాటిగా మారింది. ఈ ముద్దుగుమ్మ తాజా ప్రియుడు దర్శకుడు విఘ్నేశ్‌ శివ అనే ప్రచారం మీడియాలో హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ''నానుమ్ రౌడాదాన్'' చిత్రం షూటింగ్ సమయంలో పరిచయమైన వారి మధ్య పరిచయం ప్రేమగా మారిందని, త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారని రకరకాల వదంతులు హల్‌చేస్తున్నాయి. విఘ్నేశ్‌ శివ, నయనతార షూటింగ్‌లేని సమయాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
కాగా వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీన్ని బలపరిచే విధంగా ఇటీవల ఒక సంఘటన జరిగినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దర్శకుడు విఘ్నేశ్‌ శివ తల్లిదండ్రులిద్దరూ పోలీస్ అధికారులుగా పని చేశారట. ముఖ్యంగా ఆయన తల్లి రౌడీలకు సింహస్వప్నంగా ఉండేవారట. ఎందరో గూండాల ఆటకట్టించిన ఆమె గురించి తెలిసి నయనతారే షాకైంది. 
 
అలాంటిది ఎట్టకేలకు తను ప్రియుడు తల్లిని పరిచయం చేయడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందని సమాచారం. దాన్ని మరింత పెంచుకోవడానికి నయనతార ఇటీవల విఘ్నేశ్‌ శివ తల్లిని తన ఇంటికి ఆహ్వానించి మంచి విందునిచ్చారని ప్రచారం జరుగుతోంది. నయన్ స్వయంగా తానే వంట చేసి కాబోయే అత్తకు వడ్డించిందట. ఇప్పుడు ఈ విషయమే మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తం మీద అత్త కోసం నయనతార వంటింటి బాట పట్టారన్న మాట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments