Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీ మీనన్‌ను వివాహం చేసుకోబోతున్న విశాల్?

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (20:31 IST)
Lakshmi Menon_Vishal
తమిళ స్టార్ హీరో విశాల్ త్వరలో ఒక నటిని వివాహం చేసుకోబోతున్నాడని కోలీవుడ్‌ కోడై కూస్తోంది. ఆమె మరెవరో కాదు లక్ష్మీ మీనన్. తమిళ స్టార్ హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 
 
తెలుగుతో పాటు తమిళంలోనూ నటిస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 
ఆన్ స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నాడు. తమిళ ప్రజల్లో రియల్ హీరోగా నిలుస్తున్నాడు.
 
ఇదిలా ఉంటే విశాల్‌కి ప్రస్తుతం 45 ఏళ్లు, ఇంకా పెళ్లి చేసుకోలేదు. కరోనా లాక్‌డౌన్‌కు ముందు అనిషాతో విశాల్ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఆ సంబంధం పెళ్లి వరకూ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో విశాల్ తన సహనటి లక్ష్మీ మీనన్‌తో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. 
 
దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇకపై విశాల్ లేదా లక్ష్మీ మీనన్ రియాక్ట్ అయితే ఈ రూమర్స్‌కి బ్రేక్ పడే అవకాశం ఉంది. సినిమా విషయానికి వస్తే లక్ష్మీ మీనన్ ప్రస్తుతం చంద్రముఖి 2 కోసం పని చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments