Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

డీవీ
గురువారం, 30 జనవరి 2025 (19:57 IST)
Yash- Taxis
సినిమా తీయడానికి కెమెరా వుంటే చాలదు. దాన్ని సరిగ్గా తీసే కెమెరామెన్ కావాలి. దర్శకుడు దిశానిర్దేశం చేయాలి. హీరో అందుకు అంగీకరించాలి. చాలా సందర్భాల్లో తీసిన ఫుటేజ్ ను ఎక్కువగా తీసి ఆ తర్వాత అంతా చుట్టు చుట్టేవారు. రానురాను దానిని వర్కింగ్ షాట్స్ గా సినిమా రిలీజ్ తర్వాత థియేటర్లలో రిలీజ్ చేసేవారు. మారిన టెక్నాలజీ రీత్యా నిడివి ఎక్కువైతే రెండో భాగంగా మార్చి దానికి కొన్ని హంగులు దిద్దడం అలవాటయింది. చెప్పినదానికి తీసినదానికి చాలా వ్యత్యాసం వుండేలా రాజమౌళి చేస్తుంటాడని నిర్మాతలు చెబుతుంటారు. కానీ దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలో ఆయనకే తెలుసు.
 
ఇక అసలు విషయానికి వస్తే పాన్ ఇండియాగా యశ్ హీరోగా చేస్తున్న సినిమాను నెలపాటు షూటింగ్ చేసినట్లు తెలిసింది. దానికి కోట్ల రూపాయలఖర్చు కూడా అవుతుందనే తెలిసిందే. అయితే తీసిన ఫుటేజ్ చూశాక హీరోకు నచ్చక మొత్తం డిలీట్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఆయన హీరోగా టాక్సిక్ సినిమా రూపొందింది.  గీతూ మోహ‌న్ దాస్ చెప్పిన క‌థ‌నచ్చి ముంబైలో నెల రోజుల పాటు ఓ షెడ్యూల్ నిర్వ‌హించారు. తీరా.. ఫుటేజీ చూసుకొంటే హీరోగారికి న‌చ్చ‌లేద‌ట‌. మరి ధానిని తీసేయడం ఓకే. మరోలా ఉపయోగించుకోవచ్చనే ఆలోచన దర్శకుడు చెప్పడం కూడా జరిగిందట. మరి ఆ ఫుటేజ్ వుంటుందో లేదో సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలియదు. సహజంగా ప్రమోషన్ లో మాత్రం వేస్టేజ్ ఏమీ జరగలదేని చెప్పడం మామూలే. ఈసారి ఏమి చెబుతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments