Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలిసి తిరిగితే అదున్నట్టేనా... మీడియాతో శృతి ఫైర్

తమిళ హీరో కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తక్కువ కాలంలోనే ఆ బ్రాండ్ నుంచి బయటపడింది. ఎక్స్‌పోజింగ్ అయినా యాక్టింగ్ అయినా తనకు నచ్చిన పంథాలో చేసుకుంటూ పోతూ ఉంది. ఈ అమ్మడు కోలీ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (17:12 IST)
తమిళ హీరో కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తక్కువ కాలంలోనే ఆ బ్రాండ్ నుంచి బయటపడింది. ఎక్స్‌పోజింగ్ అయినా యాక్టింగ్ అయినా తనకు నచ్చిన పంథాలో చేసుకుంటూ పోతూ ఉంది. ఈ అమ్మడు కోలీవుడ్‌, టాలీవుడ్‌ కంటే బాలీవుడ్‌పైనే ఫోకస్‌ ఎక్కువగా పెట్టింది. తాజాగా ఈ భామ గురించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. కత్రినా కైఫ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన బాలీవుడ్‌ లవర్‌బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో శృతి ప్రేమలో పడిపోయాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
 వీరిద్దరూ ఇదివరకే ఓ యాడ్‌ఫిల్మ్‌ కోసం కలిసి పనిచేశారు. ఆ సమయం నుంచే వీరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. అంతేకాదు రణ్‌బీర్‌ తాజా సినిమా ''యే దిల్‌ హై ముష్కిల్'' షూటింగ్‌ స్పాట్‌కు కూడా శృతి పలుసార్లు వచ్చిందని, షూటింగ్‌ గ్యాప్‌లో వారు మాట్లాడుకుంటూనే ఉండేవారనీ బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ చాలాసార్లు చెట్టాపట్టాలేసుకుని నైట్‌ క్లబ్‌లకు, ముంబైలోని సబర్బన్‌ రెస్టారెంట్లకు వెళ్లారని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
 
అయితే ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు శృతి తనదైన శైలిలో స్పందించింది. ''ఇలాంటి వార్తలు నాకు చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. అన్నీఅర్థంలేని మాటలు. అందులో ఎటువంటి నిజం లేదు. నేను నా వృత్తి జీవితంలో తీరికలేకుండా ఉన్నాను. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే.. ఈ రూమర్స్‌ నాపై ఎలాంటి ప్రభావం చూపవు'' అని రణ్‌బీర్‌కు, తనకు మధ్య ఏమీలేదని శ్రుతిహాసన్‌ తేల్చి చెప్పారు. ఈ ఏడాది రణ్‌బీర్‌.. తన ప్రేయసి కత్రినాకైఫ్‌తో విడిపోయినట్లు బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments