నాగార్జున బాలీవుడ్ రీమేక్‌కి ఓకే చెప్పారా..?

Webdunia
బుధవారం, 22 జులై 2020 (11:15 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున... నూతన దర్శకుడు సాల్మన్ డైరెక్షన్ లో వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీ తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ… అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
 
వైల్డ్ డాగ్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రవీణ్ సత్తారు సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే… నాగ్ బాలీవుడ్ రీమేక్‌లో నటించనున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ… ఏంటా రీమేక్ అంటే… బాలీవుడ్లో సక్సస్ సాధించిన రైడ్ మూవీ. ఈ సినిమా నాగ్‌కు బాగా నచ్చిందట. అందుకనే తెలుగు రీమేక్‌లో నటించాలనుకుంటున్నారు. కథ బాగా నచ్చడంతో ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నాగార్జునే స్వయంగా నిర్మించాలనుకుంటున్నారు. 
 
అయితే… ఈ కథను తెరకెక్కించడం కోసం సరైన డైరెక్టర్ ను సెర్చ్ చేస్తున్నాడట నాగ్. ఒకరిద్దరు కొత్త దర్శకులను అనుకున్నప్పటికీ… ఇప్పటి వరకు డైరెక్టర్ ఎవరు అనేది ఖరారు కాలేదు. త్వరలోనే డైరెక్టర్ ఎవరు అనేది ఫైనల్ చేయనున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలింపు.. భార్య సూసైడ్... మనస్తాపంతో భర్త కూడా

Kavitha: ఆంధ్ర రాజకీయ నాయకులు మాటలు నచ్చవు.. అదేంటి అలా తిట్టుకోవడం?

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments