Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Powerstar అఫీషియల్ ట్రైలర్.. పవన్ లుక్ అదుర్స్ (వీడియో)

Webdunia
బుధవారం, 22 జులై 2020 (11:12 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై సినిమా తీస్తున్నాడు. . ఈ సినిమా మొదలైనప్పటి నుండి రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తోన్న వర్మ 'గడ్డి తింటావా?' అంటూ సాగే ఈ పాటను ఇటీవల విడుదల చేశాడు. ఇక ఈ సినిమా ట్రైలర్‌కు కూడా వర్మ డబ్బులు వసూలు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తలకోక్కంటికి 25 వసూలు చేసాడు. 
 
సినీ చరిత్రలో ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా సినిమా ట్రైలర్‌కి కూడా టికెట్ ధర నిర్ణయించాడు. జూలై 22న ఉదయం 11 నుండి "పవర్ స్టార్" ట్రైలర్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో అందుబాటులో ఉంటుందని.. ఈ ట్రైలర్ చూడాలంటే పే ఫర్ వ్యూ పద్ధతిలో 25 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నాడు. అయితే ఇంతలోనే ట్రైలర్ లీకైందని వార్తలు రాగా.. ట్రైలర్ కోసం అడ్వాన్స్ బుక్కింగ్ చేసుకున్న వాళ్ల డబ్బులు తిరిగి ఇవ్వబడతాయంటూ ట్వీట్ చేశాడు వర్మ. 
 
తాజాగా విడుదలైన ట్రైలర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా కరోనా వేళ వరుసగా సినిమాలు చేస్తూ వర్మ అదరగొడుతున్నాడు. అడల్ట్ స్టార్ మియా మాల్కోవాతో క్లైమాక్స్ తీసిన ఆయన.. ఆ తర్వాత కొత్త అమ్మాయి శ్రీ రాపాకతో నగ్నం తీసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మర్డర్ అని, థ్రిల్లర్ అని రెండు మూడు సినిమాలు ప్రకటించిన వర్మ.. 'పవర్ స్టార్' పేరిట ఓ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.

ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్‌లో రెండు మూడు డైలాగ్స్ పేలుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవిలా కనిపిస్తున్న ఓ వ్యక్తి సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న క్యారెక్టర్‌తో మాట్లాడుతూ.. నీ గుండెలా మీద చేయేసుకుని చెప్పరా.. నువ్వు పవర్ స్టార్ అయ్యింది.. కానిస్టేబుల్ కొడుకు గాన లేఖ నా తమ్ముడి గాన అనే డైలాగ్ పేలుతోంది.. ఇంకా ఇలాంటీవి రెండు మూడు ఉన్నాయి. ఇక పవర్ స్టార్ సినిమా ఈ నెల 25న ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదలకానున్నట్లు ప్రకటించాడు వర్మ.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం