ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న సంఘటనలు అందరికీ తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ ఎన్నికల్లో ఎంత హడావుడి జరిగిందే. వారిపై వీరు వీరిపై వారు విమర్శలు, బాహాటంగా మీడియా ముందుకు రావడం జరిగింది. ఓడినవారు గెలిచినవారిపై నిందలు, మూకుమ్మడి రాజీనామా చేయడం జరిగాయి.
ఓడినందుకు ముందుగా నాగబాబు రాజీనామా, ఆ తర్వాత ప్రకాష్‌రాజ్ రాజీనామా, అనంతరం ఆయన పేనల్ రాజీనామాలు జరిగాయి. అయితే ఇలాంటి విషయాలపై బాలకృష్ణ ఎక్కువగా స్పందించలేదు. కానీ గురువారంనాడు ఆహా! ప్రోగ్రామ్‌లో ఆయన అన్నమాటలు `మా` ఎన్నికల్లో ఓడిపోయినవారికి తగిలేలా వున్నాయి. ఇది పెద్ద హాట్‌గా మారింది.
ఒకవైపు అల్లు అరవింద్‌తో చనువుగానే సెటైర్‌లు వేస్తూ, షడెన్‌గా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ, తను చేసే ప్రోగ్రామ్‌కు కనెక్ట్ చేసుకున్నారు. ఆయన ఏమన్నారంటే, ఇండస్ట్రీలో పోటీ వుంటుంది. వుండాలి. అవి సినిమాలు అయినా రాజకీయాలైనా తప్పదు. ఒక్కోసారి ఫలితాలు ఆశాజనకంగా వుండవు. పోటీ అనేది అంతవరకే. బయటకు వచ్చాక మనిషిగా మారిపోవాలి. బావి లోంచి బయటకు రావాలి. అలా మనిషిని ఆవిష్కరించేదే ఆహా!లోని అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఈ ప్రోగ్రామ్‌లో ఎంతో మంది తమ మనసులోని విషయాలు బయటపెట్టి బరువు తగ్గించుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చాడు. దీనితో బాలయ్య ఇన్‌డైరెక్ట్‌గా ప్రకాష్‌రాజ్ వర్గంపైన సెటైర్ వేశాడని అనుకుంటున్నారు. సో.. ఈ కార్యక్రమంలోకి ముందుముందు బాలయ్య బాబు నాగబాబు, ప్రకాష్‌రాజ్‌తో కూడా ఇన్‌వాల్వ్ చేయనున్నాడని తెలుస్తోంది.