Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరణ్‌ నెక్ట్స్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్..!

Webdunia
బుధవారం, 22 జులై 2020 (11:21 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌… దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే… ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయడం జరిగింది.
 
ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేసాడు కానీ… చరణ్‌ మాత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఎనౌన్స్ చేయలేదు. దీంతో చరణ్‌ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది.
 
చరణ్‌‌తో సినిమా చేయబోయే దర్శకులు అంటూ కొరటాల, సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి, గౌతమ్ తిన్ననూరి, మెహర్ రమేష్‌… ఇలా కొంత మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. ఎవరితోనే ప్రాజెక్ట్ సెట్ కాలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఛలో, భీష్మ సినిమాలతో సక్సస్ సాధించిన వెంకీ కుడుముల చరణ్‌ కి కథ చెప్పాడట.
 
ఈ కథ చరణ్‌‌కు చాలా నచ్చిందట. దీంతో ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని.. మనం కలిసి సినిమా చేద్దామని వెంకీ కుడుమలకు చరణ్ మాట ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం వెంకీ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని తెలిసింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మించనున్నట్టు టాలీవుడ్ టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments