Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్‌ - ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్, బడా ప్రొడ్యూసర్ భారీ స్కెచ్..! (video)

Advertiesment
మహేష్‌ - ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్, బడా ప్రొడ్యూసర్ భారీ స్కెచ్..! (video)
, మంగళవారం, 21 జులై 2020 (13:13 IST)
ఎన్టీఆర్-మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో ఓ భారీ చిత్రం నిర్మించాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు మెగా ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. మహేష్ బాబుకి గతంలో కథ చెప్పించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియలేదు.
 
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజా వార్త ఏంటంటే... మహేష్ బాబు - ఎన్టీఆర్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ నిర్మించాలి అనుకుంటున్నారట. మహేష్‌ - ఎన్టీఆర్ కలిసి నటించేందుకు ఓకే చెప్పారట. దీంతో అల్లు అరవింద్… వీరిద్దరికి సెట్ అయ్యే కథ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు అని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.. టాప్ రైటర్స్ ఈ భారీ మల్టీస్టారర్ స్టోరీ కోసం కసరత్తు చేస్తున్నారని తెలిసింది.
 
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. రాజమౌళితో చేస్తున్న ఆర్ఆర్ఆర్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
 
ఇక మహేష్‌ బాబు విషయానికి వస్తే... సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నారు. ఈ క్రేజీ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన డా.కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు.
 
 మహేష్‌ - ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత మల్టీస్టారర్ మూవీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక వాస్తవం అయితే...
 అటు ఘట్టమనేని అభిమానులకు ఇటు నందమూరి అభిమానులకు పండగే.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాలిలో కరోనా వైరస్ వస్తుందనీ... ఇంటిని ప్లాస్టిక్ కవర్లతో కప్పేసిన బాలీవుడ్ హీరో!!