Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు - పూరి సినిమా, ఈసారైనా సెట్స్ పైకి వెళుతుందా..?

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (22:31 IST)
మెగాస్టార్ చిరంజీవి – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా అంటూ గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చిరు రీ-ఎంట్రీ ఇవ్వాలనుకు న్నప్పుడు పూరి డైరెక్షన్లో అయితేనే బాగుంటుంది అనుకున్నారు. పూరి చిరు కోసం ఆటోజానీ అనే కథ రెడీ చేయడం.. చిరుకు చెప్పడం కూడా జరిగింది. చిరు 150వ సినిమా పూరి డైరెక్షన్లో అంటూ రామ్ చరణ్‌ ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది.
 
అయితే… ఊహించని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత చిరు డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్షన్లో ఖైదీ నెంబర్ 150 సినిమా చేయడం తెలిసిందే. 
 
అయితే... చిన్నప్పటి నుంచి చిరు ఫ్యాన్ అయిన పూరి ఎప్పటికైనా చిరుతో సినిమా తీస్తానని.. చెబుతున్నారు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా వరుసగా కథలు రెడీ చేసారు పూరి. అలా రెడీ చేసిన కథల్లో చిరంజీవి కోసం రాసిన కథ కూడా ఉందని టాక్ వచ్చింది.
 
తాజా వార్త ఏంటంటే... ఇటీవల పూరి చిరంజీవిని కలసి కథ చెప్పారట. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. కథ నచ్చి చిరు పాజిటివ్‌గా స్పందించారని... ఖచ్చితంగా చిరు - పూరి కాంబినేషన్లో మూవీ ఉంటుందని మరోసారి వార్తల్లోకి వచ్చింది.
 
గతంలో చిరంజీవితో ఆటోజానీ అనే సినిమా తీయాలనుకున్నారు పూరి కానీ సెట్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు చిరు కోసం చాలా డిఫరెంట్ స్టోరీ రెడీ చేసాడట. మరి.. ఈసారైనా పూరి - చిరు మూవీ సెట్స్ పైకి వెళుతుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments