Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనూ తప్పుకుంటే.. ఇలియానాకు ఛాన్సిచ్చారు.. గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

మాస్ మహారాజ రవితేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. నేలటికెట్‌తో హిట్ కొట్టాలనుకుంటున్న రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ''అమర్ అక్బర్ ఆంటోని''. ఈ చిత్రంలో రవితేజ డిఫరెంట్ గెటప్స్‌

Webdunia
సోమవారం, 21 మే 2018 (12:49 IST)
మాస్ మహారాజ రవితేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. నేలటికెట్‌తో హిట్ కొట్టాలనుకుంటున్న రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ''అమర్ అక్బర్ ఆంటోని''. ఈ చిత్రంలో రవితేజ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రలకి జోడీగా ముగ్గురు కథానాయికలను తీసుకోనున్నారు. ఒక హీరోయిన్‌‍గా అనూ ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేసుకున్నారు.
 
కానీ డేట్స్ సర్దుబాటు చేయలేక అనూ ఇమ్మాన్యుయేల్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దాంతో ఆ ప్లేస్‌లోకి ఇలియానాను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు రీ ఎంట్రీ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఇలియానా ఈ ఛాన్సును వదులుకోకపోవచ్చునని సినీ పండితులు అంటున్నారు. అదే జరిగితే ''కిక్'' సినిమాలో కలిసి నటించిన ఇలియానా, రవితేజ జంట.. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపిస్తుంది. 
 
ఇక మరో కథానాయిక పాత్ర కోసం శ్రుతిహాసన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా అమెరికాలో 50 రోజుల పాటు జరుగుతుందని యూనిట్ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments