Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరి లోకం ఒక‌టే దిల్ రాజుకి న‌చ్చ‌లేదా, షేక్ హ్యాండ్ ఇచ్చేసి వచ్చేశారట

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (13:39 IST)
ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మంచి క‌థ అనుకుంటేనే సినిమా తీస్తారు. క‌థ విష‌యంలో రాజీప‌డ‌రు. అందుక‌నే దిల్ రాజు బ్యాన‌ర్లో నుంచి సినిమా వ‌స్తుంది అంటే... ఆ సినిమా ఖ‌చ్చితంగా బాగుంటుంద‌నేది గ‌ట్టి న‌మ్మ‌కం. ఇదిలా ఉంటే... సినిమాపై త‌న అభిప్రాయాన్ని ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్పేస్తుంటారు. దిల్ రాజు తాజాగా నిర్మించిన చిత్రం ఇద్ద‌రి లోకం ఒక‌టే. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ... సినిమాపై త‌న అభిప్రాయ‌న్ని నిజాయితీగా చెప్పేసారు.
 
ఇంత‌కీ దిల్ రాజు ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే... చైత‌న్య కాలేజ్‌లోనే కేరింత సినిమా ఫంక్ష‌న్‌ను ప్లాన్ చేశాం. ఈ కాలేజ్ స్టూడెంట్స్‌కే తొలిసారి సినిమా వేశాం. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు సోమ‌వారం నెల్లూరు, మంగ‌ళ‌వారం వైజాగ్‌, బుధ‌వారం మెల్‌బోర్న్‌లో స్పెష‌ల్ షోలు వేస్తున్నాం. రెండేళ్ల ప్ర‌యాణ‌మే ఈ సినిమా. డైరెక్ట‌ర్ కృష్ణ చెప్పిన ఐడియా న‌చ్చింది. ఇద్ద‌రు ముగ్గురు హీరోల‌ను అనుకున్నాం కానీ ఓకే కాలేదు.
 
ఇక నావ‌ల్ల కాద‌ని డైరెక్ట‌ర్‌కి చెప్పేశా. అయితే... ఓ రోజు డైరెక్ట‌ర్ కృష్ణ గారు నాకు ఫోన్ చేసి ఇలా రాజ్‌త‌రుణ్ గారిని క‌లిసి క‌థ చెప్పాం. ఆయ‌న చేస్తామ‌ని అన్నారని చెప్పాడు. త‌ర్వాత రాజ్‌త‌రుణ్ వ‌చ్చి నాతో మాట్లాడాడు. త‌ర్వాత ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. మిక్కి జె.మేయ‌ర్‌, స‌మీర్ రెడ్డి స‌హా టాప్ టెక్నీషియ‌న్స్ అంద‌రూ ఈ సినిమాకు ప‌నిచేశారు. హీరోయిన్ విష‌యంలో ముగ్గురు, న‌లుగురిని అనుకున్నాం. 
 
కానీ శిరీష్ మాత్రం షాలిని పేరును స‌జెస్ట్ చేసి ఒప్పించాడు. షాలిని ఈ ప్రాజెక్ట్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత లుక్ మ‌రింత బెట‌ర్ అయ్యింది. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఇక సినిమా గురించి చెప్పాలంటే... ఫ‌స్టాఫ్ చూసిన త‌ర్వాత నాకు న‌చ్చ‌లేదు. ఆ విష‌యాన్ని డైరెక్ట‌ర్‌కి చెప్పాను. మళ్లీ మార్పులుచేర్పులు చేసి సినిమాను చూపించారు. గ‌త నెల ఫైన‌ల్ ప్రొడ‌క్ట్ చూసి డైరెక్ట‌ర్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చేశాను. నేను ఏదైతే ఫీల‌య్యానో నిన్న స్టూడెంట్స్ సినిమా చూసి అలాంటి రెస్పాన్స్‌ను ఇచ్చారు. 
 
క‌థానుగుణంగా సినిమాను తెరకెక్కించారు. ఫ‌స్టాఫ్ టైమ్‌పాస్‌లా ఉంటుంది. సెకండాఫ్ గుడ్‌.. ముఖ్యంగా క్లైమాక్స్ వెరీగుడ్ అనిపిస్తుంది. జెన్యూన్ ఫిలిం. ఎఫ్‌2, మ‌హ‌ర్షి త‌ర్వాత ఈ సినిమాతో స‌క్సెస్ కొడితే హ్యాట్రిక్ వ‌చ్చేసిన‌ట్టే అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments