Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఆలోచనలేదు కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను: రెండో పెళ్లి పుకార్లపై మీనా

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (20:42 IST)
నటి మీనా. ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాప్ హీరోలైన రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ తదితర నటులందరితోనూ సినిమాలు చేసింది. ఐతే పెళ్లి చేసుకుని సెటిలైన మీనా జీవితంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త శ్వాస సంబంధ వ్యాధితో కన్నుమూశారు. ఆ తర్వాత ఆమె దుఃఖంలో కూరుకుపోయారు.
 
ఇదిలావుంటే మీనా రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై మీనా స్పందిస్తూ... నా భర్త చనిపోయిన రెండు నెలలకే నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానంటూ పుకార్లు పుట్టించారు. ఈ పుకార్లతో నా తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. ఐనా దీనిపై మీడియాలో ఖండించేందుకు నేను రాలేదు. ఐతే మళ్లీ నేను ఎవరో హీరోను పెళ్లి చేసుకోబోతున్నానంటూ సోషల్ మీడియాలో గాలి వార్తలు పెడుతున్నారు. వాస్తవానికి నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన ఏమాత్రం లేదు కానీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది మాత్రం నేను చెప్పలేను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనమే కారణం... తేల్చిన ఫోరెన్సిక్

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments