Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నా.. చాలా పవిత్రంగా భావిస్తున్నా: సోనమ్ కపూర్

బాలీవుడ్ సుందరాంగి సోనమ్ కపూర్.. అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. భారీ ఆఫర్లతో షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న సోనమ్ కపూర్.. వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాతో రిలేషన్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్త

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (14:31 IST)
బాలీవుడ్ సుందరాంగి సోనమ్ కపూర్.. అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. భారీ ఆఫర్లతో షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న సోనమ్ కపూర్.. వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాతో రిలేషన్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై సోనమ్‌ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తాజాగా తన ప్రేమ వ్యవహారంపై ఆసక్తికరమైన విషయాన్ని సోనమ్ కపూర్ బయటపెట్టింది. 
 
కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సోనమ్ కపూర్ తన ప్రేమాయణానికి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా మీరు ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కదా! అని సోనమ్‌ని కరణ్‌జోహర్‌ అడిగాడు. దానికి బదులిచ్చిన సోనమ్‌.. ''లండన్‌కి చెందిన వ్యాపారవేత్తతో డేటింగ్‌‌లో ఉన్నా. ఈ విషయాన్ని అక్కడితోనే వదిలేయండని బదులిచ్చింది. 
 
అంతేగాకుండా తన పర్సనల్ విషయాల గురించి ఎక్కువగా ప్రస్తావించాలని అనుకోవట్లేదు. ఎందుకంటే దాన్ని తాను చాలా పవిత్రంగా భావిస్తున్నానని.. కాబట్టి తన వ్యక్తిగత విషయం గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని సోనమ్ కపూర్ తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాలలో భూప్రకంపనలు: ఇలాంటి ఘటనల తర్వాత మన ఇళ్లు ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?

మైనర్ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం...

నెల్లూరు రేషన్ బియ్యం స్వాధీనం.. స్టెల్లాలో అధికారుల తనిఖీలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments