Webdunia - Bharat's app for daily news and videos

Install App

17న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న రాజ్‌త‌రుణ్‌ 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌'

రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై 'దొంగాట' ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (14:09 IST)
రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై 'దొంగాట' ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త'. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. 2016లో హిట్ అయిన చిత్రాల్లో 'ఈడోర‌కం-ఆడోర‌కం' సినిమా త‌ర్వాత ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న మ‌రో చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. 
 
ఈ చిత్రంలో రాజ్‌త‌రుణ్ కుక్క‌ల‌ను కిడ్నాప్ చేసే యువ‌కుడిగా పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. డ‌బ్బు కోసం కుక్క‌ల‌ను కిడ్నాప్ చేయ‌డ‌మే కాకుండా, ప్రేమ కోసం రాజ్‌త‌రుణ్ ఏంచేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అనేక మ‌లుపుల‌తో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా సాగుతుందని నిర్మాత రామబ్ర‌హ్మం సుంక‌ర తెలియ‌జేశారు. 
 
'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' వంటి హిస్టారిక‌ల్ సినిమాకు సంభాష‌ణ‌లు రాసిన‌ రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్రా ఈ సినిమాకు ఫ‌న్నీ డైలాగ్స్‌ను అందించారు. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో న‌టిస్తుండ‌టం గమనార్హం. అనూప్ రూబెన్స్ ఈసినిమాకు సంగీత బాణీలు సమకూర్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments