Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్‌ సినిమాకు వందకోట్ల బడ్జెట్టా... ఇదేం తెలుగు సినిమానా.. తప్పుకున్న లైకా..

తమిళ చిత్ర సీమలో రజనీ, కమల్ ప్రాభవం తగ్గిన నేపధ్యంలో చొచ్చుకువచ్చి పాతుకుపోయిన కొద్దిమంది హీరోల్లో విజయ్ ఒకరు. అతికొద్ది కాలంలోనే వసూళ్ల రాజా అని పేరు తెచ్చుకున్నారు కూడా. అయితే సూపర్ డూపర్ హిట్లను ఇవ్వడం తక్కువే కానీ తాను నటించిన చిత్రాలు సక్సెస్‌ ట

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (02:39 IST)
తమిళ చిత్ర సీమలో రజనీ, కమల్ ప్రాభవం తగ్గిన నేపధ్యంలో చొచ్చుకువచ్చి పాతుకుపోయిన కొద్దిమంది హీరోల్లో విజయ్ ఒకరు. అతికొద్ది కాలంలోనే వసూళ్ల రాజా అని పేరు తెచ్చుకున్నారు కూడా. అయితే సూపర్ డూపర్ హిట్లను ఇవ్వడం తక్కువే కానీ తాను నటించిన చిత్రాలు సక్సెస్‌ టార్గెట్‌ను చేరుకోకపోయినా వ్యాపారపరంగా నిర్మాతలకు గానీ, బయ్యర్లకు గానీ చేతులు కాలవనే అంటారు. విజయ్‌ ప్రస్తుతం తన 61వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌ నాయికలుగా నటిస్తున్నారు. ఆ చిత్ర శాటిలైట్‌ హక్కులే సుమారు రూ.11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తాజా సమాచారం. కాగా ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విజయ్‌ ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు.
 
విజయ్‌ ఏఆర్‌.మురుగదాస్‌ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే తుపాకి, కత్తి వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు వచ్చాయి. కాగా విజయ్, ఏఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో తాజా చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ సంస్థ రజనీకాంత్, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం, ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా తాజాగా విజయ్‌తో నిర్మించనున్న చిత్రం నుంచి డ్రాప్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
ఎందుకంటే ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్‌.మురుగాదాస్‌ రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ప్లాన్‌ చేశారట. రూ.100 కోట్ల బడ్జెట్‌ అంటే విజయ్‌ ప్రస్తుత బిజినెస్‌కు రెండింతలు వ్యాపారం జరగాలని, అది సాధ్యం కాదని భావించడంతోనే లైకా సంస్థ ఈ చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం. అయినా వీళ్ల పిచ్చి కానీ వందకోట్ల బడ్జెట్ పెట్టి నిర్మాతకు లాభాల పంట పండించడానికి ఇదేమన్నా తెలుగు సినిమానా.. 
 
బాహుబలి దెబ్బతో తెలుగు సినిమా స్టామినా బాలీవుడ్‌ను కూడా దాటి ఎక్కడికో వెళ్లింది. తెలుగు సినిమా గ్లోరీని చూసి మనమూ ఆ రేంజిలో తీసేద్దాం అనుకుంటే కాలుతుందని లైకా అనుభవమే చెబుతోంది. అంత పెద్ద నిర్మాణ సంస్థకే ఆ భయం తగిలిదంటే.. భారీ బడ్జెట్ సినిమాలు అంటూ గప్పాలు కొట్టుకుంటున్న వారు ఒకటికి రెండు సార్లు వెనక్కు చూసుకుంటే మంచిది జాగ్రత్త.
 
కథ మీడ దృష్టి పెట్టండిరా నాయనా అంటే అసలుది వదిలేసి మెగా బడ్జెట్ అంటూ పరుగులు తీస్తారు ఏంటో మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments