Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయ‌బారాల‌కు త‌లొగ్గిన హేమ‌, జీవిత, జ‌య‌సుధ‌ - మ‌రి విష్ణు ఏం చేయ‌బోతున్నాడు?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (14:49 IST)
MAA team
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు రాష్ట్ర ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేవిగా మారిన విష‌యం తెలిసిందే. తిప్పికొడితే 964 మంది స‌భ్యులున్న `మా`లో ప్ర‌తిసారీ ఎన్నిక‌ల హ‌డావుడి మామూలుగా వుండ‌దు. అంత‌కుముందు పేన‌ల్‌లో వున్న స‌భ్యులే ఈసారి కొత్త‌గా వేరే పేన‌ల్‌లో పోటీచేయ‌డం, లేదంటే స్వంతంగా నిల‌బ‌డ‌డం జ‌రుగుతుంది. ఇలా ఎందుకు జ‌రుగుతుంద‌నేందుకు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.
 
ముందుగా ప్ర‌కాష్‌రాజ్ సినిమా బిడ్డ‌లు అనే పేన‌ల్ ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత నాన్ లోక‌ల్‌ స‌మ‌స్య రావ‌డంతో అది ర‌చ్చ ర‌చ్చ అయింది. నాగ‌బాబు గ‌త క‌మిటీ మ‌స‌న‌బారింది అని స్టేట్ మెంట్ ఇవ్వ‌డంతో కొంద‌రు స‌భ్యుల్లో ఊపు వ‌చ్చింది. అలా హేమ‌, జీవిత రాజ‌శేఖ‌ర్‌, జ‌య‌సుధతోపాటు మ‌రో ఇద్ద‌రు పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత జ‌య‌సుధ కూడా పోటీ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అవ‌స‌ర‌మైతే మా కు త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని ప్ర‌క‌టించింది. దీంతో మీడియా ఫోక‌స్ చేసే స‌రికి మాలోని లుక‌లుక‌లు ఒక్కోటి బ‌య‌ట‌ప‌డ్డాయి. దాంతో మెగా ఫ్యామిలీకి త‌లనొప్పిగా మారింది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేశ్ తాను ఎటువంటి ఆర్థిక ప‌ర‌మైన విష‌యాలలో త‌ప్పు చేయ‌లేద‌ని ప్ర‌క‌టించాడు.
 
ఇంకో వైపు విష్ణు మంచు మా భ‌వ‌నాన్ని తాము నిర్మిస్తామ‌ని, స్థ‌లం కూడా చూశామ‌ని వెల్ల‌డించారు. ఇది మ‌రింత చ‌ర్చ అయింది. ఇక మెగా ఫ్యామిలీకి ఇది ప్రెస్టేజీ ఇష్యూగా త‌యారైంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. వెంట‌నే రంగంలోకి దిగి ప్ర‌కాష్ రాజ్ ను పోటీదారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు. ఆఖ‌రికి హేమ‌, జీవిత అందుకు అంగీక‌రించారు. సివి.ఎల్‌. న‌ర‌సింహారావు ఇలాంటి గొడ‌వ‌ల‌కు దూరంగా వుంటాన‌ని త‌ప్పుకున్నాడు. ఇక మంచు విష్ణు క‌దిలించే స్థ‌తిలో లేరు. అందుకే ఫైన‌ల్‌గా అంత‌కుముందు వున్న క‌మిటీలోని పేర్లు మార్చి కొంద‌రు తీసేశారు. వారిలో ఏడిద శ్రీ‌రామ్‌తోపాటు న‌లుగురు సీనియ‌ర్ స‌భ్యులు వున్నారు. సో. ప‌ట్టుద‌ల‌గా ఈసారి `మా` ఎన్నిక‌లు త‌మ అడుగుజాడ‌ల్లో వుండాల‌నే ఓ వ‌ర్గం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ప్ర‌కాష్‌ఱాజ్ పేన‌ల్ లిస్టు మారింద‌ని తెలుస్తోంది. 
 
ఇదిలా వుండ‌గా, నాగ‌బాబు మ‌స‌క బారింది అన్న మాట‌ల‌కు అర్థం ఏమిటి? అస‌లు మాలో ఏం జ‌రుగుతుందో మీరు చెప్పాల‌ని విలేక‌రులు ప‌ట్టుబ‌డితే ప్ర‌కాష్‌రాజ్ దాటవేస్తూ, అది ఆయ‌న్నే అడ‌గండి అంటూనే, కొన్ని చెప్ప‌కూడ‌ని విష‌యాలు వుంటాయి. కొన్ని చెప్పే విష‌యాలుంటాయ‌ని చెప్ప‌కుండానే చెప్పాడు. సో. ఫైన‌ల్‌గా ప్ర‌కాష్‌రాజ్‌ను గెలిపించే దిశ‌గా మెగా ఫ్యామిలీ కంక‌ణం క‌ట్టుకుంది. మ‌రి మోహ‌న్‌బాబు ఊరుకుంటాడా? త‌న‌కూ ప‌ట్టుద‌ల వుంటుందిగ‌దా.. మ‌రి ఏం జ‌రుగుతుందో ఎల‌క్ష‌న్ డేట్ నాటికి స‌రికొత్త క‌థ మొద‌ల‌వ్వ‌బోతోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments