Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖి పొట్టి-వరుణ్ తేజ్ హైట్.. ఐటమ్ ఛాన్స్ మిస్.. మిస్టర్ సరసన బాహుబలి గర్ల్..?!

మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా, లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మిస్టర్. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మాతలు. ఇటీవలే ఈ సినిమా

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (16:28 IST)
మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా, లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మిస్టర్. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మాతలు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఉగాదికి సినిమా ఆడియోను విడుదల చేయబోతున్నామని... ఏప్రిల్ 14న చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం శ్రీముఖి ఎంపికైందని జోరుగా ప్రచారం సాగింది. శ్రీనువైట్ల శ్రీముఖిని ఈ సినిమాలో ఐటెం సాంగు కోసం తీసుకుందామనుకున్నాడట. అయితే వరుణ్ తేజ్ ఆరడుగుల అందగాడు.. ఇక శ్రీముఖి పొట్టి కావడంతో శ్రీనువైట్ల ఆమెను పక్కనబెట్టేశాడని తెలిసింది. అంతేగాకుండా.. శ్రీముఖి స్థానంలో బాహుబలి సినిమాలోని మనోహరా.. పాటకు చిందులేసిన మధుస్నేహను తీసుకున్నట్లు సమాచారం. 
 
ఇకపోతే.. బుల్లితెర నుంచి వెండితెరపై సందడి చేస్తున్న యాంకర్లు అనసూయ, రష్మీలతో శ్రీముఖి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే అనసూయ, రష్మిలు వెండి తెరపైన అందాలను ఆరబోయగా... శ్రీముఖి మాత్రం ఇప్పటి వరకు పద్దతైన పాత్రల్లోనే కనిపించింది. కానీ వరుణ్ సరసన ఐటెమ్ సాంగ్ ఛాన్స్ రాగానే శ్రీముఖి ఎగిరి గంతేసింది. అయితే ఆ ఛాన్స్ కూడా మిస్ కావడంతో శ్రీముఖి.. అనసూయ, రష్మీలా మెగా పాపులర్ అయ్యే అవకాశాన్ని ఎత్తు కారణంగా మిస్ చేసుకున్నానని తెగ ఫీలవుతుందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments