Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ అగర్వాల్ అవకాశాలను తన్నుకుపోతున్న యంగ్ హీరోయిన్ ఎవరు?

కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లోని అగ్ర హీరోయిన్లలో ఒకరు. ఈ మధ్యకాలంలో అమ్మడు మళ్లీ తెగ బిజీ అయిపోయింది. 'జనతా గ్యారేజ్' చిత్రంలో ఐటం సాంగ్‌‍లో తళుక్కున మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (11:22 IST)
కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లోని అగ్ర హీరోయిన్లలో ఒకరు. ఈ మధ్యకాలంలో అమ్మడు మళ్లీ తెగ బిజీ అయిపోయింది. 'జనతా గ్యారేజ్' చిత్రంలో ఐటం సాంగ్‌‍లో తళుక్కున మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్.150' చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతవరకు బాగానే ఉంది. 
 
ఒకపుడు అవకాశాలు లేక ఐటమ్ సాంగ్‌లు చేసేందుకు సిద్ధమైన కాజల్‌కు కాలం కలిసివచ్చింది. ఫలితంగా టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ మళ్లీ బిజీ అయిపోతోంది. దీంతో కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనుకొన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ఓ యంగ్ హీరోయిన్ దిమ్మతిరిగే షాకులిస్తోంది. ఇంతకీ ఆ యంగ్ బ్యూటీ ఎవరో కాదు.. హెబ్బా పటేల్. ఈమె తన అందచందాలతో కుర్రోళ్ల మనసుల్లో స్థానం కొట్టేసింది. 
 
'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలిసింది. ఇందులో ఓ హీరోయిన్‌గా కాజల్‌ పేరును ఖరారు చేశారు. అయితే, ఇప్పుడామె స్థానంలో హెబ్బా పటేల్‌ని తీసుకోవాలని డిసైడ్ అయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
హెబ్బాని తీసుకొంటే సినిమాకి క్రేజ్ రావడంతో పాటు.. రెమ్యూనరేషన్ విషయంలోనూ కలిసొస్తుందని చిత్రబృందం భావిస్తుందట. ఇంకోవైపు, యంగ్ హీరో రామ్ చేయబోయే తదుపరి చిత్రంలో కాజల్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ఆఫర్‌ని కూడా హెబ్బా తన్నుకుపోయినట్టేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. "ఎక్కడికి పోతావు చిన్నవాడా", "నాన్న.. నేను.. నా బాయ్ ఫ్రెండ్స్" వరుస హిట్స్‌తో హెబ్బా మాంఛి ఊపుమీదుంది. దీంతో.. కాజల్ కంటే హెబ్బా బెటరని ఫీలవుతున్నారట. మొత్తానికి.. కాజల్‌కి షాకుల మీద షాకులిస్తుంది హెబ్బా పటేల్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments