Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రీనాతో కటీఫ్.. లండన్ అమ్మాయిని పెళ్ళి చేసుకోనున్న రణ్ బీర్ కపూర్.. అంతే ఓకేనా?

బాలీవుడ్ ప్రేమ పక్షులుగా ముద్రవేసుకుంది.. కత్రీనా కైఫ్, రణ్ బీర్ కపూర్ జంట. చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. సహజీవనం కోసం ఫ్లాట్స్ వెతకడం అంటూ బిజీ బిజీగా గడిపిన కత్రీనా-రణ్ బీర్ జంటకు ఏమైందో ఏమో కానీ.. ఉ

Webdunia
గురువారం, 11 మే 2017 (12:37 IST)
బాలీవుడ్ ప్రేమ పక్షులుగా ముద్రవేసుకుంది.. కత్రీనా కైఫ్, రణ్ బీర్ కపూర్ జంట. చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. సహజీవనం కోసం ఫ్లాట్స్ వెతకడం అంటూ బిజీ బిజీగా గడిపిన కత్రీనా-రణ్ బీర్ జంటకు ఏమైందో ఏమో కానీ.. ఉన్నట్టుండి విడిపోయారు. కలిసి తిరగడం ఆపై విడిపోవడం బాలీవుడ్‌లో ఫ్యాషనైపోయింది.

ఇదే తరహాలో కత్రీనా-రణ్ బీర్ కపూర్ చెరొక దారిలో వెళ్ళిపోయారు. తాజాగా కత్రీనా సినీ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఆమెకు అవకాశాలు అంతంత మాత్రంగా వస్తున్నాయి. ఇక రణ్ బీర్ కూడా సినిమాలు చేస్తూ పెళ్లి చూపులకు రెడీ అయిపోయినట్లు తెలిసింది. 
 
తన కుమారుడు రణబీర్ కపూర్‌కు బాలీవుడ్ నటిని భార్యను చేసేందుకు ససేమిరా అంటున్న నీతూ సింగ్ కపూర్, ఓ లండన్ అమ్మాయిని చూసేందుకు కొడుకుతో సహా లండన్ వెళ్లినట్టు తెలుస్తోంది. బిటౌన్ వార్తల ప్రకారం లండన్‌కు చెందిన ఓ వ్యాపార దిగ్గజం కుమార్తెతో రణ్ బీర్ పెళ్లి చూపుల కార్యక్రమం ఉందని... అందుకే నీతూ, ఆర్కే లండన్ ఫ్లైట్ ఎక్కేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
నీతూ దగ్గరి సన్నిహితులు ఈ సంబంధాన్ని ఖరారు చేశారని.. దాదాపు అంతా ఖరారైనట్టేనని టాక్ వస్తోంది. గతంలో దీపికా పదుకునే, కత్రీనాతో లవ్వాయణం జరిపిన రణ్ బీర్ కపూర్.. ప్రస్తుతం లండన్ అమ్మాయిని పెళ్లాడుతాడా లేదా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

సింహంతో స్కైడైవింగ్.. వీడియో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments