Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు 'రామాయణం'లో నందమూరి హీరో..? మెగా హీరోలకు మొండిచేయేనా...?

భారతదేశ రికార్డులను అత్యంత కర్కశంగా చెరిపేస్తున్న "బాహుబలి" ప్రభంజన మహత్యమేమో కానీ వరుసగా భారీ ప్రాజెక్టులకు అంకురార్పణ జరుగుతోంది. మొన్నేమో మోహన్‌లాల్ 'మహాభారతం' అంటే... నిన్నటికి నిన్న అల్లుగారు 'రామాయణం' అన్నారు. బడ్జెట్ లెక్కల్లో నిక్కచ్చిగా వ్యవ

Webdunia
గురువారం, 11 మే 2017 (11:26 IST)
భారతదేశ రికార్డులను అత్యంత కర్కశంగా చెరిపేస్తున్న "బాహుబలి" ప్రభంజన మహత్యమేమో కానీ వరుసగా భారీ ప్రాజెక్టులకు అంకురార్పణ జరుగుతోంది. మొన్నేమో మోహన్‌లాల్ 'మహాభారతం' అంటే... నిన్నటికి నిన్న అల్లుగారు 'రామాయణం' అన్నారు. బడ్జెట్ లెక్కల్లో నిక్కచ్చిగా వ్యవహరించే అల్లు అరవింద్ మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి తెలుగు, తమిళం, హిందీల్లో ఈ ప్రాజెక్టుని ప్లాన్ చేస్తున్నారు.
 
నిర్మాత ఎలాగూ అల్లు అరవిందే కనుక, హీరో పాత్ర మెగా కాంపౌండ్‌ని దాటి మరొకరి చేతికి పోదన్నది నిర్వివాదాంశం. కానీ రాముడి పాత్రకొస్తే... ఎంత క్షత్రియుడైనా, వీరాధివీరుడైనా మన భారతీయ సినిమాల్లో రామ, కృష్ణ, విష్ణు పాత్రధారులకు మీసం తీసేయడం తప్పనిసరి. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో మొదలుపెట్టి, బన్నీ, సాయిధరమ్, వరుణ్‌తేజ్‌లకు రామ, లక్ష్మణ క్యారెక్టర్లకు సరిపోతారా అన్నదే టాలీవుడ్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ. పవన్ కళ్యాణ్‌తో అల్లుగారికి ఏమాత్రం సత్సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.
 
ఇక తెలుగు మార్కెట్లో అత్యంత క్రేజ్ ఉన్న ఏ తెలుగు హీరోని తీసుకున్నా, మీసం తిప్పేందుకే కాక, తీసేందుకు కూడా సిద్ధంగా ఉండేది నందమూరి హీరోలే. 'లెజెండ్' బాలకృష్ణ ఇప్పటికే బాపు రామునిగా అంతగా నప్పలేదు. ఇక రాముని క్యారెక్టర్‌కు యంగ్ టైగర్‌ తప్ప మరో ఛాయిస్ లేదని, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే అల్లు ఇక ఎన్టీఆర్ ఇంటి తలుపు కొట్టక తప్పదన్న చర్చలు జరుగుతున్నాయి. ఇక రావణాసురుని క్యారెక్టర్‌కు భళ్లాలదేవుడినే ఎంపిక చేయనున్నారని వినికిడి. ఏది ఏమైనా, అల్లుగారు స్వయంగా మరోసారి ప్రకటిస్తే తప్ప ఈ ఊహాగానాలకు తెరపడదు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments