జయహో బాహుబలి.. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రశంసల జల్లు.. ట్విట్టర్లో ఫోటోలు

బాహుబలి-2' మూవీ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. రూ. 1000 కోట్ల మార్కును అందుకుని సరికొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా 9వ రోజుకే రూ.వెయ

Webdunia
గురువారం, 11 మే 2017 (11:02 IST)
బాహుబలి-2' మూవీ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. రూ. 1000 కోట్ల మార్కును అందుకుని సరికొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా 9వ రోజుకే రూ.వెయ్యి కోట్ల రికార్డును అందుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి 2 సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. 
 
భాష, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు బాహుబలిని ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్, తన కూతురు ఐశ్వర్య ట్విట్టర్‌లో బాహుబలిపై పొగడ్తలు కురిపించారు. ఈ చిత్రం సాధించిన విజయానికి అర్జున్.. టీం సభ్యులను అభినందనలు తెలియజేశాడు. 
 
ఇక అమరేంద్ర బాహుబలిగా నటించిన ప్రభాస్‌ని స్వీట్ హార్ట్ అని కొనియాడాడు. మంచి మనసున్న వ్యక్తి, హ్యాండ్ సమ్ గై అని సంబోధించి..  జయహో బాహుబలి అంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలోనే అర్జున్, ఐశ్వర్య బాహుబలి 2 చిత్ర షూటింగ్ సమయంలో ప్రభాస్, అనుష్క, రాజమౌళితో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్లో వైరల్ అయ్యాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments