Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్‌తో 'గబ్బర్ సింగ్' బ్యాచ్... పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (16:52 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 50వ పుట్టినరోజు వేడుకలను బుధవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించనున్న పలు ప్రాజెక్టుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ చిత్రం పింక్‌‌ను తెలుగులోకి వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్న విషయంతెల్సిందే. ఈ చిత్రం తర్వాత క్రిష్ జాగర్లమూడితో 27వ చిత్రం, ఆ తర్వాత హరీష్ శంకర్‌తో 28వ చిత్రంలో నటించనున్నారు. ఆ తర్వాత తన 29వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నారు. అలాగే, మరికొందరు దర్శకుడు పవన్‌కు కథలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. 
 
ఇదిలావుంటే, పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం సినీ ఇండస్ట్రీలోని రికార్డులను తిరగరాసింది. స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తన కెరీర్‌లోనే ఊహించిన దానికంటే ఎక్కువ బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. 
 
హ‌రీష్ శంక‌ర్ - ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో వ‌చ్చిన ఈ సినిమాలో ప‌వ‌న్ స్టైలిష్ యాక్టింగ్, త‌న‌దైన మేన‌రిజంతో అంద‌రికీ వినోదాన్ని అందించాడు. ఇపుడు ఈ క్రేజీ కాంబినేష‌న్ మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ద‌మైంది. 
 
ఇప్ప‌టికే హరీష్‌శంక‌ర్ ‌- ప‌వ‌న్ కాంబోలో మూవీ రానుంది. తాజాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వచ్చేసింది. గ‌బ్బ‌ర్ సింగ్‌తో అల‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‌- హ‌రీష్ శంక‌ర్ ‌- దేవీ శ్రీ ప్ర‌సాద్ హిట్ కాంబినేష‌న్ మ‌రోసారి అంద‌రినీ అల‌రించేందుకు ముస్తాబైంది.
 
మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నిర్మించనుంది. ప్ర‌జా నాయ‌కుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఎలివేట్ చేసే విధంగా హ‌రీష్ శంక‌ర్ క‌థ‌ను సిద్దం చేశాడ‌ని టాక్ వినిపించ‌గా.. ఈ మూవీ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ కాద‌ని ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌న్నది సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments