తమ్ముడూ.. నేను కూడా మీలాంటి వీరాభిమానినే : హరీశ్ శంకర్

సోమవారం, 18 మే 2020 (20:41 IST)
తమ్ముడూ.. నేను కూడా మీలాంటి వీరాభిమానినన్న సంగతి మర్చిపోకు. ఏది ఏమైనా, తన తదుపరి ప్రాజెక్టు పవర్ స్టార్‌తో చిత్రం పూర్తి చేశాకే ఉంటుందని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దర్శకుడు హరీశ్ శంకర్ సమాధానమిచ్చారు. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో గతంలో 'గబ్బర్ సింగ్' అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రం విడుదలై ఇటీవలే 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో పవన్ - హరీశ్ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. దీనికి సంబంధించిన వర్క్ జోరుగా సాగుతోంది. 
 
ఈ పరిస్థితుల్లో పవన్ సినిమా కంటే ముందే హరీష్‌తో సినిమా చేస్తున్నామంటూ 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా ఉంటుందనే వార్తలు వస్తుండటంతో 'టాక్సీవాలా' చిత్ర నిర్మాత, పవన్ కల్యాణ్ అభిమాని అయిన ఎస్.కె.ఎన్. ట్విట్టర్‌లో హరీష్ శంకర్‌కు ఓ రిక్వెస్ట్ చేశారు. 
 
'అన్నా.. ఎన్ని సినిమాలు అయినా చెయ్.. కానీ తదుపరి మా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తోనే మీ సినిమా ఉండాలి. మరియు ఆ సినిమా చరిత్ర సృష్టించాలి' అని నిర్మాత ఎస్.కె.ఎన్ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. 
 
దీనికి హరీష్ శంకర్.. 'తమ్ముడూ.. పవర్ స్టార్ మూవీకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ మరియు మ్యూజిక్ వర్క్ జరుగుతున్నాయి. నేను ఎన్ని కమిట్‌మెంట్స్ అంగీకరించినా.. అవన్నీ పవన్ కల్యాణ్‌ సినిమా తర్వాతే. నేను కూడా మీ లాంటి అభిమానినే అని మరిచిపోకు!!' అని హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్.. హరీష్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 

 

Thammudu..... Power Star movie script work and music work under progress!! What ever may be the new commitment would be only after #PSPK28

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తారక్ ఫ్యాన్స్‌కు నిరాశ.. సారీ చెప్పిన 'ఆర్ఆర్ఆర్' యూనిట్