మదనపల్లె సబ్‌కలెక్టరుగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని!

ఆదివారం, 17 మే 2020 (17:52 IST)
పవర్ స్టార్ పవన కళ్యాణ్‌కు లక్షలాది మంది వీరాభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో పృథ్వీరాజ్ ఒకరు. ఇపుడు ఈ వీరాభిమాని సబ్ కలెక్టర్‌గా నియముతులయ్యారు. గత 2011లో ఐఐటీ టాప్‌గా నిలించిన పృథ్వీరాజ్ ఇపుడు... సివిల్ సర్వీస్‌లో 24వ ర్యాంకు సాధించి సబ్ కలెక్టరుగా నియమితులయ్యారు. 
 
పృథ్విరాజ్ గత 2011లో ఐఐటీ టాపర్‌గా నిలిచాడు. ఈ విషయం పవన్‌కు తెలిసి, ప్రత్యేకంగా అభినందించారు. ఆ సమయంలోనే సౌత్ కొరియాలోని శాంసంగ్‌ కంపెనీలో లక్షలాది రూపాయలకు కొలువు దొరికింది. అయినప్పటికీ ఆ ఉద్యోగానికి వెళ్లడం లేదు. 
 
దీనికి కారణం సివిల్ సర్వీస్‌ శిక్షణ నిమిత్తం ఢిల్లీకి వెళ్లేందుకు వీలుగా సౌత్ కొరియా ఉద్యోగానికి వెళ్లలేదు. ఆ తర్వాత సివిల్ సర్వీసులో 24వ ర్యాంకును సాధించాడు. ఫలితంగా మదనపల్లె సబ్ కలెక్టరుగా నియమితులయ్యాడు. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ మరోమారు అభినందించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం స్కూల్స్ తెరిచాక విధించే కొత్త రూల్స్ ఏంటో తెలుసా?