Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

సెల్వి
సోమవారం, 18 ఆగస్టు 2025 (23:28 IST)
dharma mahesh
హీరో ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు మహేష్, కుటుంబ సభ్యులపై భార్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. 
 
వరకట్నం వేధింపులకు సంబంధించి గతంలో ధర్మ మహేశ్‌కు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఇప్పటివరకు ధర్మ మహేష్ సింధూరం, డ్రింకర్ సాయి వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. ధర్మా మహేష్ అలియాస్ కాకాని ధర్మసత్య సాయి శ్రీనివాస మహేష్(30)కు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్  గౌతమి (31)తో 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 
 
గౌతమితో పాటు ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో  ఇద్దరు కలిసి ఓ హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. కాగా ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలకు అలవాటు పడిన ధర్మా మహేష్, యువతులతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురి చేయసాగాడు. 
 
ఇంకా వరకట్నం తేవాలని వేధించడం మొదలెట్టాడు. ధర్మ మహేష్, అతని కుటుంబ సభ్యుల శారీరక, మానసికవేధింపులకు విసిగిపోయిన భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది. దీంతో గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో హీరో ధర్మా మహేష్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments