Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు కారం చాలా ఘాటు గురూ! షూటింగ్‌కు రాలేనన్న మహేష్‌బాబు?

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (11:49 IST)
Guntur karam
మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమా అనగానే అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ ఎంతో క్రేజ్‌ వచ్చింది. దీనికి థమన్‌ సంగీతం సమకూర్చడం ప్లస్‌గా మారింది. ఇక షూటింగ్‌ జరుగుతుండగా ఇటీవలే సినిమా టైటిల్‌ ప్రకటించారు. గుంటూరు కారం అని పెట్టారు. ఆ టైటిల్‌ అభిమానుల్లో చాలామందికి నచ్చలేదు.  ఇక ఆ తర్వాత అసలు ఈ సినిమా వుంటుందా లేదా? అనే అనుమానం చాలా చోట్ల వినిపించింది. తాజాగా ఈ సినిమా నుంచి పూజాహెగ్డే, శ్రీలీల కూడా తప్పుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
 
తాజాగా సోమ, మంగళవారంనాడు జరగాల్సిన షెడ్యూల్‌ అర్థంతరంగా వాయిదా వేశారు. ఈవిధంగా రెండు సార్లు గతంలో జరిగిందట. అయితే ఈసారి మహేష్‌బాబు నేను షూటింగ్‌కు రాలేనని చెప్పినట్లు తాజా సమాచారం. ఇప్పటికే పూజాహెగ్డేకు కేటాయించిన డేట్స్‌ ప్రకారం షూటింగ్‌ జరగకపోవడంతో ఆమె తాను తప్పుకుంటున్నట్లు తెలియజేసిందని అభిజ్ఞవర్గాలు భోగట్టా. ఇక మిగిలిన క్యారెక్టర్‌ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాకోసం మిగతా సినిమాల డేట్స్‌ను వాయిదా వేసుకున్నారు. సో. గుంటూరు కారం సినిమా అందరికీ ఘాటుగా వుందని తెలుస్తోంది. ఇటీవలే సినిమాలో త్రివిక్రమ్‌ డైలాగ్‌లు విడుదలయ్యాయి. త్రీడీ బీడీ అంటూ హీరో పలికిన డైలాగ్స్‌ కూడా ఫ్యాన్స్‌కు నచ్చలేదని తెలిసింది. 
 
మరో విశేషం ఏమంటే. త్వరలో త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సినిమాను రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటించనున్నారు. పూజా కార్యక్రమాలతో ఆ సినిమాను ప్రారంభించనున్నట్లు సమాచారం. కనుక గంటూరు కారం సినిమా లేనట్లేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments