Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాక్సీవాలా భామ ప్రియాంక పుకార్లకే పరిమితమా??

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (17:36 IST)
టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌గా మారిన ప్రియాంక జవాల్కర్ ఆ సినిమా విడుదలైన తర్వాతే వేరే సినిమాలు ఒప్పుకోవాలనే కాన్సెప్ట్‌తో దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉండిపోయింది. అయితే అంతగా ఎదురుచూసిన టాక్సీవాలా విడుదలై, ప్రాఫిటబుల్ వెంచర్ అనిపించుకున్నప్పటికీ, ప్రియాంకకి మాత్రం హిట్ హీరోయిన్ అనే ముద్రని తీసుకురాలేకపోయింది. 
 
ఈ సినిమా విషయంగా క్రెడిట్ మొత్తం విజయ్ దేవరకొండ కొట్టేయడంతో, ప్రియాంక వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. దీనికితోడు వరుసగా వస్తున్న గాసిప్స్ ఆమెను మరింత ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈమె కెరీర్‌కు సంబంధించి పుకార్లు ఎక్కువగానూ, సినిమాలు తక్కువగానూ అనుకుంటున్నారు.
 
వివరాలలోకి వెళ్తే... టాక్సీవాలా రిలీజైన వెంటనే రవితేజ, ప్రియాంకని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే, డిస్కో రాజా నటీనటుల జాబితాలో ప్రియాంక జవాల్కర్ పేరు లేదు. ఆ తర్వాత గోపీచంద్, నాగచైతన్య సినిమాలలో కూడా ఈమెను హీరోయిన్‍‌గా తీసుకోబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఆ సినిమాలకు కూడా వేరే హీరోయిన్‌లను తీసేసుకున్నారు.
 
ఇక ఇటీవలి కాలంలో అఖిల్ సరసన ప్రియాంక అంటూ కొత్తగా కథనాలు వినిపించాయి. గీతా ఆర్ట్స్-2 బ్యానర్‌లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ చేయబోయే సినిమాలో ప్రియాంక జవాల్కర్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారంటూ స్టోరీలు వినిపించినప్పటికీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది.
 
ఇలా ఈ భామ టాక్సీవాలా తర్వాత పూర్తిగా పుకార్లకే పరిమితమైపోయి, అఫీషియల్‌గా ఒక్క సినిమాకి కూడా నోచుకోలేకపోయింది. మరి ఆవిడ తదుపరి సినిమా ఎప్పుడు, ఎవరితో సెట్స్ పైకి వస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments