రియల్ లైఫ్ హీరోగా మారిన శిరీష్...

గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:59 IST)
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన చాలా మంది హీరోలలో ఒకడైన అల్లు శిరీష్ రియల్ లైఫ్‌లో కూడా హీరో అయిపోయాడట... అయితే ఏదో ఫైట్లు గట్రాలు చేసేసో... సహాయాలు చేసేసో కాదు... హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పించి మాత్రమే.
 
వివరాలలోకి వెళ్తే... ప్రస్తుతం అల్లు శిరీష్ 'ఏబీసీడీ' అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్‌డ్ దేశీ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన చిత్రంలో నటించాడు. ఈ సినిమాలోని 'మెల్ల మెల్లగా' అంటూ సాగే పాటను నేడు చిత్రబృందం విడుదల చేసిన ఈవెంట్‌లో భాగంగా చిత్ర దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
 
"ఈ పాట షూట్ చేస్తున్న సమయంలో కొందరు తాగుబోతులు అటుగా వెళుతూ హీరోయిన్ రుక్సార్‌ని ఏదో కామెంట్ చేసారు. మేమంతా షూటింగ్‌లో బిజీగా ఉండి పట్టించుకోలేదు. కానీ శిరీష్ మాత్రం షాట్ అయిపోగానే కారులో వెళ్లి రుక్సార్‌ని కామెంట్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి, ఆమెకు క్షమాపణ చెప్పించాడు’’ అని సంజీవ్ రెడ్డి వెల్లడించారు.
 
సాధారణంగా ఇటువంటివన్నీ సినిమాలలో చూస్తూనే ఉంటాము... కానీ రియల్ లైఫ్‌లో కూడా పాపం చాలా కష్టపడ్డట్లున్నారు హీరోగారు... ఎవరిని ఇంప్రెస్ చేయనో మరి...

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నేచురల్ స్టార్‌ నానీతో స్పెషల్ సాంగ్‌కి రకుల్ సై..??