Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ మహరాజ్ రవితేజ చేతుల మీదుగా '' జెమ్'' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (15:53 IST)
యువ హీరో విజయ్ రాజా నటిస్తున్న కొత్త సినిమా ''జెమ్'' . రాశీ సింగ్, నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు, అలోక్ జైన్, అజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహా లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పత్తికొండ కుమార్ స్వామి నిర్మాత. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ''జెమ్'' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ''జెమ్'' సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను మాస్ హీరో రవితేజ శుక్రవారం రిలీజ్ చేశారు.
 
ఈ సందర్భంగా హీరో విజయ్ రాజా మాట్లాడుతూ... మా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన రవితేజ గారికి కృతజ్ఞతలు. రెండేళ్లు శ్రమించి సిద్దం చేసిన కథను అంతే బాగా తెరకెక్కించారు మా దర్శకుడు సుబ్రహ్మణ్యం గారు. యాక్షన్ బేస్డ్ గా జెమ్ మూవీ ఉంటుంది. ఆండ్రూ కెమెరా పనితనం, సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి అన్నారు.
 
దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... ఎక్కడా రాజీ పడకుండా జెమ్ మూవీని రూపొందించాం. హై టెక్నికల్ వ్యాల్యూస్ ఉంటాయి. సినిమా పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉన్నాం. ప్రతిభ గల సాంకేతిక నిపుణులు మా చిత్రానికి పనిచేయడంతో అనుకున్నట్లుగా మూవీని చేయగలిగాం అన్నారు.
 
నిర్మాత పత్తికొండ కుమారస్వామి మాట్లాడుతూ... జెమ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు సుబ్రహ్మణ్యంకు మొదటి సినిమా ఇది. కష్టపడి సినిమా రూపొందించారు. విజయ్ రాజా ఇన్ వాల్వ్ అయ్యి నటించారు. సినిమాకు పూర్తిగా సహకరించారు. ఔట్ పుట్ సంతృప్తికరంగా వచ్చింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, ఆండ్రూ సినిమాటోగ్రఫీ మా సినిమాకు ఆకర్షణ అవుతాయి అని అన్నారు.
 
శివాజీ రాజా మాట్లాడుతూ... కుమారస్వామి గారు తమిళ, కన్నడలో సినిమాలు చేశారు. తెలుగులో మా అబ్బాయితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయన తెలుగులోనే వరుసగా సినిమా చేసేంత పేరు జెమ్ చిత్రంతో రావాలి. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన రవితేజకు థ్యాంక్స్. సినిమా హిట్ అవ్వాలి, అందరికీ పేరు రావాలని కోరుకుంటున్నానని అన్నారు.
 
సత్యకృష్ణ, రచ్చ రవి, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, సత్తి పండు, గబ్బర్ సింగ్ రాజశేఖర్, అనంత్, నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - ఆండ్రూ, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం - సునీల్ కశ్యప్, ఫైట్ మాస్టర్ - రియల్ సతీష్, డాన్స్ - భాను, అజయ్, నిర్మాత - పత్తి కొండ కుమారస్వామి, రచన దర్శకత్వం - సుశీల సుబ్రహ్మణ్యం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments