Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐరా సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ నం.1 ఫిల్మ్ ప్రారంభం

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (15:41 IST)
నాగ‌శౌర్య హీరోగా 'ఛ‌లో', 'అశ్వ‌థ్థామ' లాంటి సూప‌ర్ హిట్ సినిమాల్ని నిర్మించిన ఐరా క్రియేష‌న్స్ సంస్థ నుంచి సోద‌ర సంస్థ‌గా ఐరా సినిమాస్ ప్రారంభ‌మైంది. ఔత్సాహిక న‌టులు, ద‌ర్శ‌కుల‌తో కంటెంట్ ప్ర‌ధాన చిత్రాల‌ను నిర్మించ‌డం ఐరా సినిమాస్ ఏర్పాటులోని ఉద్దేశం. చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టాల‌ని క‌ల‌లు క‌నే నూత‌న‌ న‌టులు, ద‌ర్శ‌కుల‌కు ఇది మంచి అవ‌కాశం.
 
హైద‌రాబాద్‌లోని సంస్థ కార్యాల‌యంలో ఐరా సినిమాస్ నిర్మిస్తోన్న తొలి చిత్రం ప్రారంభోత్స‌వం జ‌రిగింది. స‌న్నీ కొమాల‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి న‌టుడు, వ్యాపార‌వేత్త, ఏఎస్‌పీ మీడియా హౌస్‌ అధినేత అభిన‌వ్ స‌ర్దార్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. న‌వంబ‌ర్ 9 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఉషా శంక‌ర్‌ప్ర‌సాద్ ముల్పూరి మాట్లాడుతూ, "ఇవాళ మంచిరోజు కావ‌డంతో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాం. ఐరా సినిమాస్ అనేది ఐరా క్రియేష‌న్స్‌కు సోద‌ర సంస్థ‌. యంగ్ టాలెంట్‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతో బ్యాన‌ర్‌ను ప్రారంభించాం. ఫ్రెష్ కంటెంట్‌తో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్‌ను ఈ బ్యాన‌ర్‌పై నిర్మిస్తాం. స‌న్నీ కొమాల‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో మేం నిర్మిస్తున్న తొలి చిత్రం ఓ థ్రిల్ల‌ర్" అని చెప్పారు.
 
త్వ‌ర‌లో ఈ చిత్రానికి ప‌నిచేసే తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.
ద‌ర్శ‌కుడు: స‌న్నీ కొమాల‌పాటి
నిర్మాత‌: ఉషా శంక‌ర్‌ప్ర‌సాద్ ముల్పూరి
స‌హ నిర్మాత‌: అభిన‌వ్ స‌ర్దార్‌
స‌మ‌ర్ప‌ణ‌:  బుజ్జి
బ్యాన‌ర్స్‌: ఐరా సినిమాస్‌, ఏఎస్‌పీ మీడియా హౌస్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments